నితిన్ తో సంబంధం లేదా?

నితిన్ వరస ప్లాప్స్ తర్వాత వెంకీ కుడుములు డైరెక్షన్ లో లక్కీ గర్ల్ రష్మిక తో కలిసి భీష్మ సినిమా చేసాడు. ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న భీష్మ [more]

Update: 2020-02-05 08:11 GMT

నితిన్ వరస ప్లాప్స్ తర్వాత వెంకీ కుడుములు డైరెక్షన్ లో లక్కీ గర్ల్ రష్మిక తో కలిసి భీష్మ సినిమా చేసాడు. ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న భీష్మ సినిమా సాంగ్స్ మార్కెట్ ని ఓ ఊపుఊపుతున్నాయి. నితిన్ – రష్మిక ల కెమిస్ట్రీ సినిమాకి హైలెట్ అనేలా ఉంది. సాంగ్స్ లో వీరిద్దరి రొమాంటిక్ యాంగిల్ చూస్తుంటే.. భీష్మ ఖచ్చితంగా హిట్ కొడుతుంది అనిపిస్తుంది. ఇక టీజర్ కూడా ఆసక్తిగా ఉండడం, హారిక హాసిని వారు అల వైకుంఠపురములో సినిమా తో భారీ హిట్ కొట్టడం, అదే సంస్థ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుండి బీష్మ రావడంతో.. అల బయ్యర్లు అంతా భీష్మ మీద పిచ్చ ఆసక్తి కనబరుస్తున్నారు.

కేవలం ఆసక్తి మాత్రమే కాదు.. భీష్మ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది అంటున్నారు. వెంకీ కి ఛలో హిట్ ఉన్నప్పటికీ, నితిన్ కి వరసగా మూడు నాలుగు ప్లాప్స్ ఉన్నప్పటికీ, రష్మిక ఎంతగా లక్కీ గర్ల్ అయినప్పటికీ… బయ్యర్లు భీష్మ సినిమాని మాత్రం అల వైకుంఠం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూసే పోటీలు పడుతున్నారని అంటున్నారు. రెండు సాంగ్స్ తో పాటుగా భీష్మ టీజర్ కూడా బావుండడంతో.. బాయ్ర్లు భీష్మ ని భారీ రేట్లకు కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపుతున్నారట. నితిన్ – రష్మిక జోడికి సాంగ్స్ తో క్రేజ్ రావడం, భీష్మ కి ట్రేడ్ లో హైప్ ఉండడంతో.. ఈసారి నితిన్ హిట్ పక్కా అంటున్నారు. గత ఎడాది సినిమాలే విడుదల చెయ్యని నితిన్ కి భీష్మ భారీ హిట్ ఇస్తుందని అంటున్నారు. మరి ఫిబ్రవరి అన్ సీజన, విద్యార్ధులకి పరిక్షల సమయం అయినా.. భీష్మ క్రేజ్ తో సినిమా పక్క హిట్ కొట్టడం గ్యారెంటీ అంటుంది భీష్మ టీం.

Tags:    

Similar News