నితిన్ ‘టీ గ్రిల్’ కు సమంత ఓపెనింగ్

Update: 2016-11-18 06:29 GMT

అఆ చిత్రంలో అనసూయ రామలింగం, ఆనంద్ విహారి పాత్రలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ పాత్రలలో మెప్పించిన జంట నితిన్ రెడ్డి, సమంత రుతు ప్రభులు ఇద్దరు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలెబ్రిటీస్. నితిన్ నటనతో పాటు ఆయన సొంత నిర్మాణ సంస్థ ఐన శ్రేష్ఠ మూవీస్ లో చిత్ర నిర్మాణ వ్యవహారాలు చేపడుతూ, అడపా దడపా పంపిణీదారుడుగాను కొన్ని చిత్రాల విడుదల హక్కులను దక్కించుకుంటున్నాడు నితిన్ రెడ్డి. ఇప్పుడు చిత్ర రంగానికి సంబంధం లేని మరో కొత్త వ్యాపారంలో అడుగుపెట్టాడు ఈ హీరో.

కాస్ట్యూమ్ డిసైనర్ నీరజ కోన మరియు ఆమె భర్త తో కలిసి నితిన్ టీ గ్రిల్ అనే రెస్టారంట్ ని ఈ రోజు ప్రారంభించబోతున్నాడు. హైదరాబాద్ నగరంలో మాదాపూర్ ప్రాంతంలో ప్రారంభం కానున్న ఈ టీ గ్రిల్ ప్రారంభోత్సవం సమంత చేతుల మీదుగా జరగనుండటం విశేషం. అయితే ముఖ్య అతిధులుగా సమంత తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇది వరకే టీ గ్రిల్ అంటే టాలీవుడ్ గ్రిల్ అని అర్ధం వచ్చేలా పేరును ఖరారు చేశామని నితిన్, నీరజ కోన చెప్పారు.

Similar News