నితిన్ ఇచ్చే బహుమతి పైనే అందరి దృష్టి!!

ఈమధ్యన తమకు హిట్స్ ఇచ్చిన దర్శకులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది హీరోలకు పరిపాటిగా మారింది. గతంలో ఎన్టీఆర్, సూర్య ఇలా చాలామంది హీరోలు తమకు [more]

Update: 2020-02-22 08:03 GMT

ఈమధ్యన తమకు హిట్స్ ఇచ్చిన దర్శకులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది హీరోలకు పరిపాటిగా మారింది. గతంలో ఎన్టీఆర్, సూర్య ఇలా చాలామంది హీరోలు తమకు హిట్ ఇచ్చిన దర్శకులకు ఏ కారో, ఏ ప్లాటో బహుమతిగా ఇచ్చారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు తో హిట్ ఇచ్చిన శ్రీవాస్ కి కాస్ట్లీ ఫ్లాట్ ఇచ్చిన విషయం హైలెట్ అయ్యింది. అలాగే దర్శకుడు మారుతికి ప్రతి రోజు పండగే నిర్మాత కారుని బహుమతిగా ఇచ్చాడు. చలో తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు నాగ శౌర్య కారు బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం శౌర్య – వెంకీ కాంట్రవర్సీ నడుస్తుంది అది వేరే విషయం.

తాజాగా నితిన్ కి వెంకీ కుడుములు సూపర్ హిట్ ఇచ్చాడు. మూడు వరస ప్లాప్స్ తో ఉన్న నితిన్ కి భీష్మ లాంటి భారీ హిట్ ఇచ్చాడు. మరి ఫస్ట్ సినిమా చలో కే కారు అందుకున్న వెంకీ కుడుములకి ఇప్పుడు భీష్మ హిట్ ఇచ్చిన నితిన్ ఎలాంటి బహుమతి ఇస్తాడో అంటూ సోషల్ మీడియాలో హంగామా మొదలయ్యింది. మరి చలో లాంటి చిన్న హిట్ కే కారు అందుకున్న వెంకీ కుడుముల ఇప్పుడు భీష్మ లాంటి భారీ హిట్ కి ఏం అందుకోబోతున్నాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లోనే కాదు నాలోనూ కలుగుతుంది. పాపం వెంకీ ఫస్ట్ గిఫ్ట్ కారు కాంట్రవర్సీ నడుస్తుండగా.. అందరూ రెండో గిఫ్ట్ పై మాట్లాడుతూ వెంకీ బాధపెట్టేస్తున్నారు.

Tags:    

Similar News