నిజంగానే నాగ్ కి అనుష్కకి విభేదాలా?

Update: 2017-11-16 06:16 GMT

నాగార్జున - అనుష్కల స్నేహం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. అసలు అనుష్క ని తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసిందే నాగార్జున . సూపర్ సినిమా ద్వారా నాగార్జున... అనుష్క ని తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయం చేసాడు. ఆ సినిమా నుంచి అనుష్క అక్కినేని కుటుంబం లో నుంచి వచ్చిన హీరోయిన్ గా అయిపొయింది. తర్వాత నాగార్జున మీద ఉన్న అభిమానంతో చాలా సినిమాల్లో హీరోయిన్ గాను... సోగ్గాడే చిన్నినాయనలో గెస్ట్ రోల్ లోను అలరించింది. అయితే అలాంటి అనుష్క తాజాగా జరిగిన నాగార్జున ఇంటి ఫంక్షన్ అయినా నాగ చైతన్య - సమంతల రిసెప్షన్ కి రాలేదు.

అనుష్క ఎందుకు రాలేదు?

చై -సామ్ ల రిసెప్షన్ కి చాలా మంది ప్రముఖులు వచ్చారు. అలాగే కొంత మంది షూటింగ్‌ బిజీతో రాలేకపోయారు. కాని అనుష్క ఎందుకు రాలేదు అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. అనుష్క ఎప్పుడూ.... నాకు ఏదైనా సమస్య వస్తే, అర్ధరాత్రి నాగార్జున ఇంటి తలుపు తడతా అని చెబుతుంటుంది అనుష్క. అలాంటిది ఆ ఇంట్లో జరిగిన ఒక ముఖ్యమైన శుభకార్యానికి హాజరుకాలేదు. అయితే అనుష్క రిసెప్షన్ కి హాజరుకాకపోవడానికి కారణం నాగార్జున కి, అనుష్క కి మధ్య ఉన్న విభేదాలే. అందు వల్లనే అనుష్క అక్కినేని ఫ్యామిలీ కి దూరంగా ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. కాని నాగార్జున సన్నిహితులు మాత్రం అనుష్క కి నాగార్జున కి ఎలాంటి విభేదాలు గాని, గొడవలు గాని లేవని చెబుతున్నారు. చూద్దాం ఈ విషమై నాగ్ ఎమన్నా స్పందిస్తాడేమో...!

Similar News