నిజ జీవిత పాత్రలే... తెరమీద కూడా?

Update: 2017-10-31 05:00 GMT

నిజ జీవితంలో వెంకటేష్ - నాగ చైతన్య మేనమామ - మేనల్లుడు. ఇపుడే అదే క్యారెక్టర్స్ తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక కథ తాయారుచేసాడు అని చెబుతున్నారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ ఈ మేనమామ - మేనల్లుడిపై కథని తయారు చేసాడంటున్నారు. ఎపుడో వచ్చిన 'సోగ్గాడే , సోగ్గాడే చిన్ని నాయన , శతమానంభవతి , ఫిదా' వంటి సినిమాలన్నీ పల్లెటూరు నేపథ్యంలో వచ్చి హిట్టు కొట్టినవే కాబట్టి.. అలంటి పల్లెటూరి వాతావరణంలోనే ఈ మావ అల్లుళ్ళ సినిమాని కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేస్తున్నాడట.

ఈ సినిమాలో వెంకటేష్ మేనమామగా , నాగ చైతన్య మేనల్లుడిగా కనిపిస్తారని.... వీరి ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్ని చాలా ఫన్నీగా.. అందంగా ఉంటాయంటున్నారు . పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న కథ కాబట్టి... ఈ సినిమాలో ఎక్కువ శాతం పల్లెటూరి యాస కూడా వుండే అవకాశం ఉందంటున్నారు.అయితే ప్రస్తుతం చైతు ఈ కథకి ఓకే చెప్తాడో లేదో చూడాలి అంటున్నారు. ఒకవేళ ఈ సినిమాని ఓకే చేసినాకాని చైతు డేట్స్ ఎప్పుడిస్తాడో తెలియాలి. ఎందుకంటే ప్రస్తుతానికి చందు మొండేటి - మైత్రీ మూవీస్ సినిమాకు డేట్ లు ఇచ్చాడు.

ఆ తర్వాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ - మారుతి సినిమాకు డేట్స్ ఇవ్వాలి. అయితే ఇక్కడ దర్శకుడి మారుతి సినిమా.... అలాగే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సమాంతరంగా చేసే అవకాశం వుందని చెబుతున్నారు.

Similar News