నాన్‌ 'బాహుబలి' రికార్డులు బ్రేక్‌ కావడం ఖాయమంటున్నారు.....!

Update: 2016-04-05 02:09 GMT

ఏడాది కాలం నుండి 'బాహుబలి' రికార్డులు చెక్కుచెదరలేదు. మహేష్‌ 'శ్రీమంతుడు' చిత్రం రికార్డులను క్రియేట్‌ చేసినప్పటికీ 'బాహుబలి' రికార్డులకు ఎంతో దూరంలో ఆగిపోయింది. కాగా 'బాహుబలి' చిత్రం తెలుగులో 110కోట్లను వసూలు చేసింది. కాగా ఈ రికార్డులను పవన్‌ నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ఏకంగా 3500 థియేటర్లలో విడుదలకు సిద్దం అవుతోంది. కాగా ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ వస్తే 'బాహుబలి'ని దాటడం ఖాయమంటున్నారు. ఇక ఓపెనింగ్స్‌ విషయంలో 'సర్దార్‌' చిత్రం సంచలనానికి నాంది పలకనుంది. ఈ చిత్రం హిందీలో కూడా విడుదల అవుతున్న దృష్ట్యా పవన్‌ అక్కడ కూడా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాడా? లేక తెలుగులో లాగానే కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం అవుతాడా? అన్నది వేచిచూడాల్సివుంది ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్ధ మాత్రం ఈ చిత్రం ప్రమోషన్‌లో చురుగ్గా పాల్గొనాలని పవన్‌పై ఒత్తిడి తెస్తోందని సమాచారం. కానీ పవన్‌ మాత్రం సినిమాలో విషయం ఉంటే ప్రమోషన్‌ లేకపోయినా బాగా ఆడుతుందని, సినిమాలో విషయం లేకపోతే ఎంతగా ప్రమోషన్‌ చేసినా లాభం ఉండదని బద్దలు కొట్టినట్లు ఈరోస్‌కు సమాధానం ఇచ్చాడని సమాచారం. కాగా ఈ చిత్రంలో పవన్‌కు ప్రతినాయకుడుగా నటిస్తున్న శరద్‌ కేల్కర్‌ ఇందులో భైరవ్‌సింగ్‌ పాత్రను చేస్తున్నాడు. కాగా ఇటీవల వరకు ఆయన కేవలం ఓ హిందీ సీరియల్స్‌లో ఓ సాధారణ నటుడు మాత్రమే. కానీ ఆయన 'బాహుబలి' హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం,దాంతో ఆయన రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు అదే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ పవన్‌ చిత్రంలో విలన్‌ పాత్రను చేస్తుండటం, మరోవైపు ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరిద్దరి పాత్రలు బాలీవుడ్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయని దర్శకనిర్మాతల ఆలోచనగా చెబుతున్నారు.

Similar News