నాన్న 151 కూడా నా నిర్మాణంలోనే

Update: 2017-01-04 11:26 GMT

మెగా స్టార్ చిరంజీవికి గీత ఆర్ట్స్ అల్లు అరవింద్, వైజయంతి మూవీస్ చలసాని అశ్విని దత్ వంటి బడా నిర్మాతలు పలువురు సుప్రీమ్ హీరో నుంచి మెగా స్టార్ గా మారిన అనంతరం ఆ చరిష్మా కలకాలం నిలిచిపోయే స్థాయి సినిమాలు తీసి చిరు కి అండగా నిలిచారు. గీత ఆర్ట్స్ మెగా ఫామిలీ కి హోమ్ బ్యానర్ కాగా, వైజయంతి మూవీస్ మెగా స్టార్ తో తీసిన చిత్రాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా వున్నాయి. ఎనిమిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం చేస్తున్న 150 వ చిత్రాన్ని తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి అప్పగించిన చిరు తో తదుపరి 151 వ చిత్రం తమ బ్యానర్ లో తీయాలని ఆశపడ్డ నిర్మాతలు ఎందరో వున్నారు. అటువంటి నిర్మాతల ఆశలపై నీళ్లు జల్లుతూ ఒక ప్రకటన చేశాడు రామ్ చరణ్ తేజ్.

"ఖైదీ నెం.150 విడుదల తేదిని 11 వ తారీకుకి లాక్ చేశాం. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదు. మా సినిమా బాల కృష్ణ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ పోటీ అని మేము అనుకోవటం లేదు. సంక్రాంతి పండుగకి రెండు లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలు సంచలన విజయాలు నమోదు చేసే వెసులుబాటు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కలిపిస్తారు. నాన్న నటించబోయే 151 వ చిత్రం కూడా నేనే నిర్మించనున్నాను. ఆ సినిమాకి సంబంధించిన కథ, దర్శకుడు ఖరారు ఐన అనంతరం అధికారికంగా వివరాలు నేనే వెల్లడిస్తాను. ఖైదీ నెం.150 విడుదలైన కొద్దీ రోజులకి ఆ వివరాలు తెలుపుతాను. ఇప్పుడు ఖైదీ నెం.150 ప్రచార కార్యక్రమాలను ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో చిత్ర బృందమంతా కష్టపడుతున్నారు. ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకరత్న దాసరి నారాయణ రావు, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు లను ఆహ్వానించాను. బాబాయ్ పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించాను." అంటూ ఖైదీ నెం.150 విడుదల వివరాలతో పాటు చిరు తదుపరి చిత్రం పై కూడా తన స్పందన తెలియజేశాడు చెర్రీ.

Similar News