నాని, అఖిల్ కి సల్లు భాయ్ ముప్పు ...?

Update: 2017-12-17 02:03 GMT

టాలీవుడ్ యంగ్ హీరోలు నాని, అఖిల్ లను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వణికిస్తున్నాడు. డిసెంబర్ చివరి వారంలో సల్మాన్ కొత్త సినిమా టైగర్ జిందా హై విడుదల కానుంది. ఆ చిత్రానికి టాలీవుడ్ కి సంబంధం ఏమిటా అని ఆరా తీస్తే సల్మాన్ చిత్రం టైగర్ జిందా హై ఓవర్సీస్ కలెక్షన్ అంతా ఎత్తుకుపోతుందని టాలీవుడ్ అంచనా వేస్తుంది. అప్పుడు నాని మిడిల్ క్లాస్ అబ్బాయి , అఖిల్ హాల్లోకి దెబ్బ పడుతుందన్న ఆందోళన నిర్మాతల్లో గుబులు రప్పిస్తుంది . పోనీ చిత్రాల తేదీలు వాయిదా వేసుకుంటే టాలీవుడ్ లో అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్, బాలయ్య , రవితేజ చిత్రాలు సంక్రాంతి క్యూలో వున్నాయి.

అన్ని సమస్యలే ...

ఇప్పటికే ధియేటర్లు కొత్త సినిమాల సమస్యను ఎదుర్కొంటున్నాయి. పండగ సినిమాల్లోకన్నా ముందుగా విడుదల చేస్తే నే థియేటర్ల లభ్యత సక్రమంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. టాలీవుడ్ పై హిందీ సినిమాల వల్ల కలెక్షన్స్ తగ్గేది ఏమి ఉండదు. కానీ ఓవర్సీస్ లో సల్మాన్ దెబ్బకి అందరి కలెక్షన్స్ ఢమాల్ మంటున్నాయి. అందులోను టైగర్ జిందా హై అంటూ ఖాన్ తీసిన కొత్త సినిమా మీద భారీ అంచనాలే వున్నాయి. మన తెలుగు యంగ్ హీరోల కలెక్షన్స్ పడుకుంటాయి ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ అవుతున్న న్యూస్ .

Similar News