నాని అందుకే బిగ్‌బాస్‌ చేస్తున్నాడా?

Update: 2018-03-22 07:15 GMT

మొదట్లో నాని సినిమాలు బాగున్నా కూడా సరిగా ఆడకపోవడం జరిగింది. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఆడియన్స్‌ ను తన యాక్టింగ్ స్కిల్స్ తో థియేటర్స్ దాక రప్పించుకుంటున్నాడు. అందుకే నిర్మాతలు నానితో సినిమా తీయడానికి వెనకాడరు.

మొన్నటివరకు క్లాస్.. ఫ్యామిలీస్ లో స్థిరపడిపోయిన నాని ఇక మాస్‌ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. తన నెక్స్ట్ మూవీ 'కృష్ణార్జున యుద్ధం' అలా మాస్‌ని టార్గెట్‌ చేసినదే. ఈ మ్యాటర్ ను పక్కన పెడితే.. కొన్ని రోజుల నుండి నాని బిగ్‌బాస్‌ షో సీజన్‌ 2 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. సీజన్‌ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేసాడు. కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఎన్టీఆర్ సీజన్‌ 2 ని హోస్ట్ చెయ్యట్లేదు. ఎన్టీఆర్ కాకపోతే అల్లు అర్జున్.. లేదా మహేష్ అనుకున్నారు బిగ్‌బాస్‌ టీం.

అయితే నాని కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరివాడేనని అతడితో ఈ షో చేయిస్తున్నారు. నిజానికి నాని ఇప్పుడున్న బిజీలో ఈ షోకి టైమ్‌ ఇవ్వలేడు. కానీ బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే మాస్‌లోకి చొచ్చుకుపోవాలనే తన పని సులువైపోతుందని భావించి ఈ షో చేస్తున్నాడట. అందుకే నాని తనకు ఇంత కావాలి, అంత కావాలి అంటూ డిమాండ్లు కూడా చేయలేదట. నాని ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ టీం అతడికి భారీగానే ముట్టజెప్తుందనుకోండి.

Similar News