నాగ్ పక్కన అనుష్క నటించడం లేదు

Update: 2017-11-30 13:00 GMT

నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో ఒక యాక్షన్ ఫిలిం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటి షెడ్యూల్ పది రోజుల రెగ్యులర్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ పది రోజుల షూటింగ్ అనంతరం నాగార్జున, అఖిల్ కోసం ఒక నెల రోజుల పాటు కేటాయించనున్నాడు. హలో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడపనున్న నాగ్ హలో విడుదల కాగానే మళ్ళీ వర్మ షూటింగ్ లో జాయిన్ అవబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతుందని.. హీరో - హీరోయిన్స్ కి అసలు రొమాంటిక్ సన్నివేశాలే ఈ సినిమాలో లేవనే ప్రచారం జరిగింది.

ఆలాగే నాగార్జున సరసన అనుష్క హీరోయిన్ గా నటించబోతుందని కూడా అన్నారు. దాదాపు అనుష్క, నాగ్ పక్కన ఫైనల్ అంన్నారు. కానీ దర్శకుడు వర్మ మాత్రం నాగార్జున సరసన అనుష్క కాదని క్లారిటీ ఇచ్చేసాడు. అనుష్కని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవడంలేదని.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఒక కొత్త బ్యూటీని తీసుకున్నామని... ఆమె పేరు మైరా సరీన్ అంటూ ట్విట్టర్ లో ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. మరి అనుష్క, నాగార్జున పక్కన నటించడంలేదు అని.. ఒక కొత్త మ్మాయిని పరిచయం చేస్తున్నట్టుగా వర్మ స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసాడు.

ఇకపోతే ఈ సినిమాని నాగార్జునే స్వయంగా నిర్మిస్తాడని అన్నప్పటికీ.... ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా వర్మ నెత్తి నే వేసుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను నిర్మాతగా కొనసాగలేనని నాగార్జున వర్మకి చెప్పడంతో ఏకంగా వర్మ రంగంలోకి దిగేశాడు. అందుకే ఈ సినిమా బడ్జెట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టాడని కొందరు అంటున్నారు. అందులో భాగంగానే రెగ్యులర్ టాప్ హీరోయిన్ అయితే బడ్జెట్ ఎక్కువ కావాలని.. ఒక కొత్త అమ్మాయి అయితే అనుకున్న బడ్జెట్ లో మూవీ పూర్తవుతుందని వర్మ భావిస్తున్నాడేమో అంటున్నారు.

Similar News