నాగ్ పంపిణీదారులు నష్ట పోనున్నారా?

Update: 2017-02-15 08:45 GMT

వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కింగ్ అక్కినేని నాగార్జున కి అక్కినేని కుటుంబమంతా కలిసి చేసిన మనం చిత్రం కథానాయకుడిగా, నిర్మాతగా తిరుగులేని విజయాన్ని అందించటంతో పాటు బయ్యర్స్ కి మంచి మార్జిన్ తో లాభాలను మిగిల్చింది. అదే సక్సెస్ జోష్ ని కొనసాగిస్తూ సోగ్గాడే చిన్ని నాయనా ని తన నిర్మాణంలోనే చేసిన నాగ్ మరొక సారి బయ్యర్స్ కి భారీ లాభాలు రావటానికి దోహదపడ్డారు. గత ఏడాది ముల్టీస్టారర్ గా తెరకెక్కిన ఊపిరి చిత్రం నాగ్ నిర్మించనప్పటికీ ఆ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టి నాగార్జునకి హాట్ ట్రిక్ హిట్స్ అందించింది. అలానే నాగార్జున పర్మనెంట్ బయ్యర్స్ కి పీవీపీ సంస్థ నుంచి విడుదల హక్కులు ఇప్పించిన నాగ్ ఊపిరి తో కూడా బయ్యర్స్ ని ప్రాఫిట్ జోన్ లోకి తీసుకు వెళ్లారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జున, సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా పేరు పొందిన కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో భక్తిరస భరితమైన చిత్రాన్ని చేయటంతో ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని మార్కెట్ అంచనాలను పరిగణలోకి తీసుకోకుండా ఫాన్సీ రేట్లకి విక్రయించారు. ఓం నమో వెంకటేశాయ థియేట్రికల్ హక్కులని ప్రపంచ వ్యాప్తంగా 33 .65 కోట్ల రూపాయలకి విక్రయించగా నిరాశపరిచిన ఓపెనింగ్స్ బయ్యర్స్ కి ఆందోళన కలిగిస్తున్నాయి. తొలి మూడు రోజులలో కేవలం 6.46 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన ఈ చిత్రం ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లే అవకాశమే లేదు. అయితే ఇప్పటి నుంచైనా ప్రేక్షకాధరణకు నోచుకుంటే బయ్యర్స్ కనీసం భరించగలిగిన నష్టాలతో బైటపడగలుగుతారు. మరో వైపు ఓం నమో వెంకటేశాయ చిత్ర బృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకులని థియేటర్లకు తీసుకు రావటానికి సరిపడే విధంగా లేవు. చిత్ర నిర్మాతలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తే చిత్ర వసూళ్ల పరిస్థితి మెరుగు పడే అవకాశాలు వున్నాయి.

Similar News