నాగ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు

Update: 2018-03-30 11:00 GMT

లేటెస్ట్ గా వర్మ అఖిల్ తో సినిమా తీస్తున్న..ఈ సినిమాకు నాగార్జున నిర్మాత అని ట్విట్టర్ లో ప్రకటించాడు. అయితే నాగ్ మాత్రం దీని గురించి ఏమి నోరు విప్పటంలేదు. అఖిల్ కూడా తనకు ఏమి తెలీదు అన్నట్టు ఉన్నాడు. అయితే అక్కినేని ఫ్యాన్స్ లో మాత్రం కలకలం రేపిన ఈ వార్త వర్మ అత్యుత్సాహంతో ఇచ్చినదా లేక నాగార్జునని ఇరకాటంలో పెట్టడానికా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

వర్మ గురించి అందరికి తెలిసిందే తను తీసే సినిమాలు కన్నా ప్రకటించే సినిమాలే ఎక్కువ. ఆయనకి ఆలా ప్రకటించి తీయకపోవడం అలవాటే. ఒకవేళ వర్మ తీసే ఆఫీసర్‌ సినిమా ఆడితే మాత్రం అఖిల్ - వర్మ సినిమా వుండే అవకాశంవుందని లేకపోతే లేదు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అఖిల్ తో సినిమా అని వర్మ ప్రకటించిన రోజు నుండే అక్కినేని ఫ్యాన్స్ లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోతే బాగుండు అని భావిస్తున్నారు. దీని కి తోడు నాగార్జున కూడా ఈ కాంబినేషన్ గురించి సైలెంట్ గా వుండడంతో అభిమానులకి ఊరటగా వుంది. ఆఫీసర్‌ చిత్రంకు క్రేజ్ తీసుకుని రావడం కోసమే వర్మ ఇలా చేసి ఉంటాడని ఇండస్ట్రీలో టాక్‌. వర్మతో సినిమా అంత ఈజీ కాదు!

Similar News