నాకు పవన్ కళ్యాణ్ తో చేయాలనీ వుంది!!

Update: 2017-11-16 07:00 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ హవా నడుస్తుంది. అయితే సక్సెస్ రేట్స్ ఎలా వున్నా దానిని ఏమి పట్టిచుకోకుండా సినిమాలు దకించుకుంటున్నారు మన హీరోయిన్స్. రకుల్ ప్రీత్ సింగ్ అదే చేస్తుంది. కెరియర్ స్టార్టింగ్ లో సక్సెస్ రుచి చూసిన రకుల్ తర్వాత సినిమాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అయినాగానీ ఈ అమ్మడుకి అవకాశాలు వస్తూనే వున్నాయి. లేటెస్ట్ గా ఈమె నటించిన ఖాకి సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రొమోషన్స్ లో బిజీ గా వున్న రకుల్ సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది.

పవన్ కల్యాణ్ తో చేయడం...

అభిమానులు అడిగిన ప్రశ్నలకు రకుల్ ఇలా మాట్లాడుతూ... ఖాకి సినిమాలో నేను చేసిన పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే డైరెక్టర్ గారు చెప్పగానే ఒప్పేసుకున్న. నాకు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో చేయటం ఇష్టం.. అవకాశం వస్తే చేస్తా.. ఒక పని చేయండి మీరు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని అడగండి సినిమా చేయమని... ఆయన ఒకే అంటే నేను రెడీ అని సమాధానం ఇచ్చింది. అలాగే నాకు విజయ్ దేవరకొండతో కూడా చేయాలని వుంది అంటూ.. తన మనసులో మాటలు బయట పెట్టేసింది ఈ ముద్దు గుమ్మ. దీనిబట్టి చూస్తుంటే రకుల్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్టు అర్ధం అవుతుంది.

Similar News