నా పేరు సూర్య సెట్స్ లో మెగాస్టార్?

Update: 2018-04-16 07:19 GMT

వక్కంతం దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న నా పేరు సూర్య వచ్చే నెల నాలుగున విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్న ఈ సినిమా పై భారీ క్రేజ్ ని పెంచడానికి చిత్ర బృందం శతవిధాలా ప్రయత్నిస్తుంది. హాట్ హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ తో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్ సినిమాల్లో మాంచి మాస్ మసాలా సాంగ్ ఉంటుంది. అందులో భాగంగానే నా పేరు సూర్య కోసం ఒక మసాలా సాంగ్ ని ప్లాన్ చెయ్యడమే కాదు.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ లో ఈ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి ఈ సాంగ్ లో వేసే మాస్ స్టెప్పులు మాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెప్పడమే కాదండోయ్... ఇప్పుడు మెగాస్టార్ కూడా చెప్పెయ్యబోతున్నాడు. ఎందుకంటే తన మేనల్లుడు అల్లు అర్జున్ సినిమా సెట్స్ లో సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి అక్కడ నా పేరు సూర్య టీమ్ తో ఫొటోస్ దిగుతూ సందడి చేసాడు. బన్నీ డాన్స్ చేస్తున్నంత సేపు చిరు ఎంజాయ్ చేశారు. సాంగ్ తనకు బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. చిత్ర యూనిట్ తో కలిసి సినిమా విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజివి గారితో పాటు గీతాఆర్ట్స్ అథినేత అల్లు అర‌వింద్ గారు కూడా విచ్చేశారు.

మరి మెగాస్టర్ చిరు తో కలిసి అల్లు అర్జున్, అను ఇమ్మాన్యువల్ లు అదిరి పోయే కాస్ట్యూమ్స్ లో మాస్ అన్న మాదిరిగా కనిపిస్తున్నారు. ఇక దర్శకుడు వక్కంతం వంశీ, అల్లు అరవింద్, శిరీష, శ్రీధర్ లు మెగాస్టార్ తో ఫోటో దిగారు. ఇప్పుడు మెగాస్టర్ నా పేరు సూర్య సెట్స్ కి వెళ్లిన ఆ పిక్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యింది.

Similar News