నవదీప్ వస్తున్నాడంట

Update: 2017-08-12 11:00 GMT

ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్నా బిగ్ బాస్ షో వారంతంలో మంచి బజ్ తో దూసుకుపోతుంటే.... వారం మధ్యలో మాత్రం నిరాశాజనకంగానే కొనసాగుతుంది. మధ్యలో కొంచెం ఈ షోకి హైప్ క్రియేట్ అయినప్పటికీ మళ్ళీ పాత సీనే రిపీట్ అవుందంటున్నారు. ప్రేక్షకులు ఎన్టీఆర్ ని చూడడానికే బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు గాని.... వారం మధ్యలో వచ్చిన బిగ్ బాస్ షో చూడడానికి ఆసక్తి కనబర్చడంలేదంటున్నాయి టీఆర్పీ రేటింగ్స్ కూడా. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షోలోకి ఎంటర్ అయిన దీక్ష పంత్ కూడా ఈ షోకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతుంది. ఇక పార్టిసిపేట్స్ వారాంతంలో ఒకొక్కరిగా ఎలిమినేట్ బాట పడుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హీరో నవదీప్ వస్తున్నాడంటున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో ప్రిన్స్, ఆదర్శ్ వంటి కుర్ర నటులే కనబడుతున్నారు. మిగతావాళ్ళు మొత్తం మిడిల్ ఏజ్ ఉన్నవారే కావడంతో ఈ షోని పెద్దగా రక్తి కట్టించలేక పోతున్నారంటున్నారు. మరి నవదీప్ ఈ షోలోకొచ్చాక ఈ షో పరిస్థితి ఎమన్నా బాగుంటుందేమో చూడాలంటున్నారు. నవదీప్ ఇప్పటికే కొన్నిసార్లు మెల్ యాంకర్ గా చేసాడు. అలాగే కొన్ని షోస్ కి హోస్ట్ కింద కూడా పనిచేశాడు. మరి బుల్లితెర మీద ఇప్పటికే ఒక వెలుగు వెలిగిన నవదీప్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలో ఎలా అలరించబోతున్నాడో అనేది వచ్చే సోమవారమే తెలుస్తుంది.

ఎందుకంటే ఈ రోజు శనివారం బిగ్ హౌస్ నుండి ఒక పార్టిసిపేట్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది . కానీ ఎలిమినేషన్ ప్రక్రియ ఈ రోజు పూర్తయినా కూడా వారి ఎలిమినేషన్ రేపు ఆదివారమే జరుగుతుంది. దీని బట్టి ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సోమవారమే మరో పార్టిసిపేట్ వస్తాడన్నమాట. ఇక బిగ్ బాస్ హౌస్ లో మనం కొత్తమొహం చూసేది సోమవారమే అన్నమాట. అయినా ఎన్టీఆర్ కోసమే వారాంతం ఎదురు చూస్తుంది గాని కొత్తవారెవరనేది ప్రేక్షకులకు ఇదివరకున్నంత క్యూరియాసిటీ లేదంటున్నారు

Similar News