నయన్ విలనా?

Update: 2017-09-24 11:00 GMT

చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రం మొదలు పెట్టుకుని అప్పుడే ఒక నెల కావొస్తుంది. కానీ ఇంతవరకు 'సైరా' రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా రూపు దిద్దుకుంటున్న ఈ సై' రా నరసింహ రెడ్డి' చిత్రంలో అమితాబ్ వంటి జాతీయ స్థాయి నటుడు, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు.. అలాగే సౌత్ లో టాప్ హీరోయిన్ నయనతార, ప్రగ్య జైస్వాల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ విషయాన్నీ చిత్ర బృందం 'సై రా' మోషన్ పోస్టర్ లోనే అధికారికంగా ప్రకటించింది.

నెగిటివ్ పాత్రలోనే....

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు 'సై రా నరసింహారెడ్డి' ని వెన్నుపోటు పొడిచే పాత్రలో నటిస్తుండగా.... ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్ నయనతార కూడా 'సై రా' లో నెగెటివ్ పాత్రలోనే కనబడనుందని అంటున్నారు. ఈ 'సైరా' చిత్రంలో చిరు పాత్రకి ధీటుగా నయనతార పాత్ర ఉండబోతుందంటున్నారు. మరి ముందునుండి చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం 'సై రా' లో నయనతార పాత్ర విలన్ పాత్రే అంటున్నారు. ఇక మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కి కూతురిగా 'సై రా' కనిపించబోతుందట. ఇక ప్రగ్య జైస్వాల్ పాత్రకి 'సై రా' లో పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా 'సై రా' కథను మలుపు తిప్పే కీలక పాత్ర అంటూ ప్రచారం జరుగుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోబుతున్నట్లు చెబుతున్నారు.

Similar News