నయన్ తో బ్రేకప్ అయ్యాక ఆమెతో ప్రేమాయణం..?

Update: 2017-03-21 11:28 GMT

నయనతార - ప్రభుదేవా ప్రేమ పీక్ స్టేజి లో ఉండగానే పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డారు. నయన్ తో పెళ్లి కోసం ప్రభుదేవా తన భార్య రమాలతకి విడాకులు కూడా ఇచ్చేసాడు. అయితే ఇద్దరి మధ్యలో ఏమైందో తెలియదు నయన్ కి ప్రభుదేవా కి బ్రేక్ అప్ అయ్యి పెళ్లి కాస్తా క్యాన్సల్ అయ్యింది. ఆతర్వాత ఎవరి కెరీర్ మీద వారు దృష్టి పెట్టారు. మళ్ళీ నయన్, శివ విగ్నేష్ తో లవ్ లో పడడం ఆ తర్వాత చాలా రోజులకి మళ్ళీ శివ విగ్నేషన్ తో కూడా బ్రేకప్ చేసుకోవడం అన్ని చక చకా జరిగిపోయాయి.

ఇక ప్రభుదేవా తాను డైరెక్ట్ చేసే సినిమాలపైనే పూర్తి దృష్టి సారించాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రభుదేవా కూడా సైలెంట్ గా మరో హీరోయిన్ తో ప్రేమాయణం మొదలు పెట్టాడని తాజాగా అందుతున్న సమాచారం. ప్రభుదేవా హీరోయిన్ తమన్నాతో క్లోజ్ గా మూవ్ అవుతూ ఎవరికీ దొరక్కుండా లవ్ మేన్‌టేన్ చేస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది. తమన్నాకి కూడా ప్రస్తుతానికి పెద్దగా సినిమా ఆఫర్స్ లేకపోవడంతో ఆమె తాన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిండం మొదలు పెట్టి లైఫ్ లో సెటిల్ అవ్వాలని చూస్తుందట.

తమన్నాకి ప్రభుదేవా కి 'దేవి'(అభినేత్రి) సినిమా చేస్తున్నప్పటినుండి వారి మధ్యన ప్రేమ మొదలైందని... కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గా మేన్‌టేన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎవరికీ తెలియకుండా ఇద్దరూ ఎక్కడో ఒక చోట మీట్ అవుతూ తమ రిలేషన్ ని మేన్‌టేన్ చేస్తున్నారట. కానీ సెలబ్రిటీస్ ఎంత సీక్రెట్ మేన్‌టేన్ చేసినా అవి మాత్రం పబ్లిక్ అవడానికి ఎంతో సమయం పట్టదనేది జగమెరిగిన సత్యం.

Similar News