నమిత పెళ్ళికి అన్ని సిద్ధం!

Update: 2017-11-15 16:00 GMT

హీరోయిన్ నమిత తన ప్రేమికుడు, నటుడు వీర్ ను ఈ నెల 24న పెళ్లిచేసుకోనుందని తెలిసిందే. తిరుపతిలోని ‘ఇస్కాన్ ’ టెంపుల్ వీరి పెళ్ళికి వేదిక కానుంది. గత కొన్ని నెలల క్రితం నమిత సీనియర్ నటుడు శరత్ బాబు ను పెళ్లాడబోతుందనే వార్తలొచ్చాయి. కాగా.. నమిత ఆ వార్తల పై తీవ్రంగా స్పందించంది. దాంతో ఆ విషయం సద్దుమణిగింది.

ఆహ్వానాలు రెడీ...

అంతలోనే నమిత తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తన ప్రియుడు వీర్ ను నవంబర్ 24న తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నాను అని నమిత తెలిపింది. ఇప్పుడు ఆ పెళ్లి పనులు జోరందుకున్నాయి… నమితే స్వయంగా తనకు దగ్గరి బంధువులను ఆహ్వానిస్తుందట.. ఇప్పుడు నమిత పెళ్లి పత్రిక ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. నమిత – వీర్ ల సంగీత్ వేడుక 22న సింధూరి పార్క్ హోటెల్ లో జరగనుండగా.. 24న ఉదయం 5:30నిమిషాలకు ఇస్కాన్ టెంపుల్ లో నమితతో వీర్ వివాహం జరగనుంది

Similar News