ధీమా గట్టిగానే కనబడుతుంది

Update: 2017-12-09 10:00 GMT

వరస హిట్స్ జోష్ తో ఉన్న నాని.. ఫిదా సినిమాతో యూత్ ని ఆకర్షించిన సాయి పల్లవి.. కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఎంసీఏ'. ఈ’ చిత్రం పై మంచి ఎక్సపెక్టషన్స్ వున్నాయి.

నేచురల్ పెర్ఫామర్లుగా గుర్తింపు తెచ్చుకున్న నాని - సాయిపల్లవి జోడీ ఎలా ఉంటుందో అని.. వీళ్ళ మధ్యన కెమిస్ట్రీ ఎలా పండుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమాలో నాని - సాయి పల్లవి జోడి కంటే.... నాని - భూమిక కాంబినేషనే సినిమాకు హైలైట్ అవుతుందని దిల్ రాజు చెబుతున్న మాట. ఇప్పటి దాక తల్లి -కొడుకు.. నాన్న - కొడుకు.. అన్న - తమ్ముడు..లాంటి రిలేషన్ల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయని.. అయితే ఈ సినిమాలో అన్నా - వదినల బంధం సంబంధించి కీలకమైన సన్నివేశాలు ఉంటాయని.. దిల్ రాజు అంటున్నాడు.

ఈ సినిమాలో నానికి వదినగా భూమిక నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ‘ఎంసీఏ' లో నాని అన్నగా రాజీవ్ కనకాల, వదినగా భూమిక స్టిల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం చేస్తున్నాడు. అతడికి మధ్యతరగతి జీవితాలపై చాలా మంచి అవగాహన ఉందని.. కాబట్టి సినిమా చాలా బాగా తీశాడని.. ఈ సినిమా తో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశాడు రాజు.

Similar News