దేనికైనా రెడీనా?

Update: 2017-11-18 03:00 GMT

గరుడవేగ' సినిమా సక్సెస్ తో టోటల్ టీం హ్యాపీ వుంది. ముఖ్యంగా హీరో రాజశేఖర్ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మళ్లీ జనాలు పాత రాజశేఖర్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ ని వెతుకుంటూ కథలు వస్తున్నాయి.

సెకండ్ కెరియర్....

అయితే గరుడ వేగా చిత్రం అంతటి పేరు తెచ్చుకున్నా కానీ సినిమా యావరేజ్ టాక్ తో నెట్టుకొస్తోంది. మొదట నుండి ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా యావరేజ్‌ స్కోరే చేసింది. దీంతో రాజశేఖర్ కి మార్కెట్ అంతగా లేకపోవడంతో నిర్మాతలు సినిమాలు తీయడానికి వెనకాడుతున్నారు. రాజశేఖర్‌ కూడా జగపతి బాబు లా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేస్తే.... బిజీ కెరియర్‌ ఉంటుందని విశ్లేషకులు చెపుతున్నారు. అయితే రాజశేఖర్‌ షూటింగులకి ఆలస్యంగా వస్తాడనే పేరుండడం వల్ల రాజశేఖర్‌ వైపుగా పాత్రలు వెళ్లడానికి కొన్ని అడ్డంకులుంటాయి. రాజశేఖర్ కి గుర్తు ఉండిపోయే పాత్రలు చేస్తే తన కెరియర్‌ కు ఢోకా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు

Similar News