దీనికే కష్టపడ్డాడు.. మరో రెండా?

Update: 2017-12-01 03:09 GMT

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనుకున్న టైం కి షూటింగ్ పూర్తికాలేదు. అసలు అక్టోబర్ లోనే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ మీటింగ్స్ వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని పూర్తి చేసేసి పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవుతాడని.. అజ్ఞాతవాసే పవన్ కి ప్రస్తుతానికి చివరి సినిమా అనే ప్రచారం జరిగింది. నిజంగానే అప్పుడప్పుడు రాజకీయాల్లోకి వెళితేనే.. అజ్ఞాతవాసి పరిస్థితి ఇలా ఉంటే.. పూర్తి స్థాయి రాజకీయాలంటే.. అనుకున్న టైం కి సినిమాలు పూర్తి చెయ్యడం అంత సులభం కాదు.

మరి 2019 ఎన్నికల నాటికి పవన్ ఒక ఏడాది ముందునుండే రాజకీయాల్లో కసరత్తులు చేస్తేనే అప్పుడు ఎన్నికల్లో ఏమన్నా ఫలితం ఉంటుంది. మరి పవనేమో అజ్ఞాతవాసి పూర్తికాగానే రెండు సినిమాల్తో బిజీ కానున్నాడు. ఒకటి నేశన్ దర్శకత్వంలో వేదలమ్ రీమేక్, మరొక సినిమా కూడా రీమేక్ సినిమానే. ఆ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. మరి పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను కేవలం ఎనిమిది నెలలో పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఎ.ఎం.రత్నం నిర్మాతగా నేశన్ దర్శకుడిగా వేదాలం రీమేక్ ను జనవరిలో మొదలుపెట్టి.. మూణ్నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేస్తాడట.

అలాగే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తేరి రీమేక్ ని కూడా పవన్ కళ్యాణ్ నాలుగునేలలే టార్గెట్ గా పూర్తి చేస్తాడట. అంటే.. జనవరి మొదట్లో నేశన్ సినిమాని... మర్చి నెలలో సంతోష్ సినిమాని మొదలెట్టే పవన్ కళ్యాణ్ ఆగష్టు కల్లా రెండు సినిమాలను పూర్తి చేసేస్తాడన్నమాట. మరి నిజంగానే పవన్ ఈ టార్గెట్ ని అందుకుంటాడా? ఒకవేళ నిజంగా అజ్ఞాతవాసి పవన్ రాజకీయాల వల్ల లేట్ అవ్వలేదా? అంటే అంతా అనుకుంటున్నట్టు త్రివిక్రమ్ వలెనే సినిమా లేట్ అవుతూ వచ్చిందా? ఏదిఏమైనా పవన్ ఎనిమిదినెలల రికార్డు టైములో రెండు సినిమాలు పూర్తి చేస్తాడనే న్యూస్ మాత్రం పవన్ ఫాన్స్ కి పిచ్చ ఆనందాన్ని ఇస్తుంది.

Similar News