దిల్ రాజు కే టోకరా వేశారే?

Update: 2017-12-21 02:14 GMT

పైరసీ చీడపురుగు సిని నిర్మాతలను భయపెట్టిస్తుంది. విడుదలకు ముందే మీ సినిమా ఫైరసీ కాకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని భయాందోళనకు గురిచేస్తున్నారు. 2012 నుంచి జవాన్ సినిమా వరకు ఓ ముఠా ఫైనాన్సియర్స్ నుంచి ఇలాగే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజ్ కే టోకరా పెడుతామని హెచ్చరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీ కారణంగా టాలీవుడ్ కు ఏటా వెయ్యి కోట్ల మేర నష్టం వాటిళ్లుతోంది. ఫైరసీ పేరుతో విడుదల కాకముందే ఓ భయంపట్టుకుంటుంది. పెద్ద సినిమాలకు ఫైరసీ భూతం పట్టి పీడిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసి సినిమా పైరసీ బారినపడిందని నిర్మాత రాధాకృష్ణ... న్యాచురల్‌ స్టార్‌ నానీ ఎంసీఏ పైరసీ అయిన సినిమాల జాబితాలో ఉందని దిల్ రాజ్ లు బుధవారం హైదరాబాద్ సి.సి.ఎస్. పోలీసులను ఆశ్రయించారు.

పైరసీ కాకుండా ఉండాలంటే....

గతంలోనూ పవన్‌-త్రివిక్రమ్‌- రాధాకృష్ణ కాబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడింది. దీనికి తోడు మళ్లీ ఫైరసీ గాళ్లు కాపుకాసుకుని కూర్చోవడంతో రాధాకృష్ణకు పోన్లు చేసి మరి సినిమా ఫైరసీ కాకుండాఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రాధాకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. అయితే 2012 నుంచి పైరసీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గిరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టా సుధాకర్ చౌదరీ, పుట్ట ప్రభాకర్ చౌదరీ, విజయలక్ష్మి చౌదరీలను అరెస్ట్ చేశారు. అయితే సినిమా ఫైరసీల పై చీమకుట్టిన దొంగలా ఉన్న సినిమా పెద్దలు.. ఇప్పుడు హాట్ హాట్ కామెంట్లు చేశారు. ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు.. డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్‌ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను అని తెలిపారు. తమకు ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తున్నా ..... అటు ప్రభుత్వానికి , ఇటు సినిమా ఇండ్రస్టీకి నష్టం చేస్తున్నారని సినిమా పెద్దలు వాపోతున్నారు. ఫైరసీని అరికట్టేందుకు పోలీసులు ఐ.టీ. మినిస్టర్ కు కొత్త చట్టం పై నివేదిక అందించారు. టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని పోలీసులు ప్రభుత్వానికి విన్నవించారు.

Similar News