దిల్ రాజు కంటే ఆంధ్ర పంపిణీదారులు తెలివైనవారే...!

Update: 2018-01-13 07:10 GMT

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాం ప్రాంతానికి పంపిణీదారుడిగా విజయదశమికి విడుదలైన రెండు భారీ చిత్రాలు జై లవ కుశ మరియు స్పైడర్ చిత్రాలతో భారీ నష్టాలని చవి చూసి సంక్రాంతి పండుగకి తన అదృష్టం పరీక్షించుకుంటూ పంపిణీ చేసిన మరో అతి భారీ చిత్రం అజ్ఞ్యాతవాసి. కాంబినేషన్ పరంగా వచ్చిన క్రేజ్ ని హారిక హాసిని సంస్థ ఎలా కాష్ చేసుకుందో ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే నైజాం మరియు సీడెడ్ ప్రాంత పంపిణీదారులతో పోలిస్తే ఆంద్ర ప్రాంత పంపిణీదారులు భరించగలిగే నష్టాలతో బైట పడిపోతున్నారు అజ్ఞ్యాతవాసి ఘోర పరాజయం చెందినప్పటికీ. ఆలా అని ఈ చిత్రం ఆంధ్ర ప్రాంతంలో ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అని కాదండోయ్.

కారణం ఇదే....

నైజాం మరియు సీడెడ్ ప్రాంతాలలో పంపిణీదారులు థియేటర్స్ కి కేవలం మినిమం గ్యారంటీ పుచ్చుకొని విడుదల చేశారు. కాబట్టి ఒక్కో థియేటర్ కి నిర్దిష్ట మినిమం గ్యారంటీ రేట్ మించి వసూళ్లు వస్తే కానీ పంపిణీదారుడికి సొమ్ము అందని పరిస్థితి. ఆంధ్ర ప్రాంతంలో చాలా జిల్లాలలో పంపిణీదారులు మినిమం గ్యారంటీ ల కంటే ఫిక్స్డ్ హైర్స్ కి సినిమా థియేటర్స్ కి విడుదల చేశారు. కాబట్టి ఆంద్ర ప్రాంతం ఎక్కువ టౌన్స్ లో నష్టం ఎక్సిభిటర్స్ భరిస్తుండగా నైజాం లో మాత్రం దిల్ రాజు ఈ చిత్రానికి ఏకంగా 15 నుంచి 17 కోట్ల రూపాయల వరకు నష్టపోనున్నారు.

Similar News