దానికోసం అన్ని రోజులెందుకండి!!

Update: 2017-07-21 03:17 GMT

నాగ చైతన్య - సమంత లు వచ్చే అక్టోబర్ 6 న గోవా లో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈపెళ్లి మూడు రోజులపాటు జరుగుతుందని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ పెళ్లి కోసం నాగ చైతన్య, సమంతలు మూడు నెలల పాటు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వనున్నారని ప్రచారం బాగా జరుగుతుంది. తాము చేసే సినిమాలకు మూడు నెలలు బ్రేకిచ్చేసి పెళ్లి, హనీమూన్ కోసం టైం స్పెండ్ చెయ్యాలని ఈ జంట అనుకున్నట్టు వార్తలొచ్చాయి.

కానీ పెళ్లి తర్వాత వెంటనే తమ తమ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఈ జంట రెడీ అంటుంది. అసలు నెలల తరబడి షూటింగ్స్ కి ఎలా సెలవిస్తామండీ... మా వలన ఎంతమందికి ఎంత లాస్. అందుకే పెళ్ళైన మూడు రోజులకే మేము మా షూటింగ్స్ కి ఎంచక్కా వెళ్లిపోతామంటుంది సమంత. మరి సమంత చెప్పింది అక్షరాలా నిజమే కదా. వీరు మూడు నెలలు షూటింగ్ కి బ్రేక్ తీసుకుంటే షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉన్న సినిమాల నిర్మాతలు ఎంత లాస్ అవుతారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సామ్ చెబుతుంది.

ఇకపోతే సమంత తెలుగులో రామ్ చరణ్ తో 'రంగస్థలం 1985 , మహానటి, రాజుగారు గది 2 ' సినిమాలు, తమిళంలో మరో రెండు చిత్రాలు చేస్తుంది. ఇక చైతూ 'యుద్ధం శరణం' షూటింగ్ పూర్తికావొచ్చింది. మరో సినిమా సెట్స్ మీదకెళ్లాల్సి వుంది.

Similar News