దర్శకుడికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరో?

Update: 2018-03-11 02:39 GMT

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్. అలాంటి అతనికి పవన్ కళ్యాణ్ ఒక సినిమా చెయ్యడం. మరి సంతోష్ చెప్పిక కథ మైత్రి మూవీస్ వారు కూడా ప్రొడ్యూస్ చెయ్యడానికి ముందుకు రావడమే కాదు ఏకంగా స్టార్ హీరో అయిన పవన్ కళ్యణ్ ని అడ్వాన్స్ ఇచ్చి బుక్ కూడా చేసుకున్నారు. కానీ పవన్ మాత్రం మాట ఇచ్చినట్టే ఇచ్చేసి సంతోష్ శ్రీనివాస్ ని హోల్డ్ లో పెట్టేసి అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. మరి పవన్ కళ్యాణ్, సంతోష్ శ్రీనివాస్ తో అసలు సినిమా చేస్తాడా?చెయ్యడా? అలాగే మైత్రి మూవీస్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తాడా? ఇలాంటి వార్తలతో సోషల్ ఇండియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది.

మరి సంతోష్ శ్రీనివాస్ తమిళనాట విజయదుందుభి మోగించిన తేరి సినిమా ఆధారంగా ఒక కథని రాసుకుని పవన్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ తోపాటు.... మైత్రి వారికి ఒక క్లారిటీ ఇచ్చేసాడు. అదేమిటంటే.. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నతాను ఒక సినిమా చెయ్యడం అనేది కుదిరేపనిగా కనిపించడం లేదని.. అందుకే సంతోష్ శ్రీనివాస్ తాను చెప్పిన కథతో మరో హీరోతో సినిమా చేసుకున్న తనకేమాత్రం అభ్యంతరాలు లేవని చెప్పాడని టాక్. ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్ ఇది.

ఇక సంతోష్ కి మాత్రమే క్లారిటీ ఇవ్వడం కాదు మైత్రి వారికి కూడా తాను తీసుకున్న అడ్వాన్స్ త్వరలోనే తిరిగిచ్చేస్తాన్ని కూడా చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఏరకంగా సంతోష్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్టే. పవన్ మీద భారీ ఆశలు పెట్టుకున్న సంతోష్ ప్రస్తుతం తనదగ్గరున్న కథతో మరో హీరో సినిమా చేయడానికి ఆహీరో వేటలో పడ్డట్టుగా వార్తలు కూడా మొదలయ్యాయి.

Similar News