థియేటర్ల నందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లు వేరయా

Update: 2018-05-14 10:13 GMT

నగరాల్లో ఇప్పుడు జనమంతా మల్టిప్లెక్స్ లో సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అలా మల్టి ప్లెక్స్ లో ఒక సినిమా చూస్తూ ఇంటర్వెల్ సమయంలో ఒక పాపకార్న్, ఒక కోక్ తాగడం అనేది సిటీ జనాలకు అలవాటు అయింది. అయితే ఇలా చేస్తున్నది కేవలం మిడిల్ క్లాస్ ఆడియన్స్ అండ్ క్లాస్ ఆడియన్స్ మాత్రమే. కానీ సినిమాలకి ఎక్కువ డబ్బులొచ్చేది మాత్రం మాస్, బి, సి సెంటర్ ఆడియన్స్ నుంచే. అక్కడ మామూలు థియేటర్ లో సినిమా చూస్తూ ఇంట్రెస్టింగ్ సీన్ దగ్గర విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చెయ్యడం అనేది అలవాటు. ఇక సినిమా కలెక్షన్స్ లో బి,సి సెంటర్స్ కలెక్షన్స్ కీలకం.

వన్నె తగ్గని క్రాస్ రోడ్స్ థియేటర్లు

ఇక హైదరాబాద్ లో ఎన్ని మల్టిప్లెక్స్ లున్నప్పటికీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న కొన్ని థియేటర్లలో హీరోలకు మంచి సెంటిమెంట్ ఉంది. అంతేకాదు అక్కడ సినిమా చూద్దాం అనేది ప్రేక్షకులకు కూడా మంచి ఆసక్తి. సుదర్శన్ 70 MM , సంధ్య లాంటి థియేటర్స్ లో సినిమాలు చూడడం అంటే కొం మందికి ఎంతో ఇష్టం. అసలు ఒక కొత్త సినిమా ఎలా ఆడుతోందో చెప్పడానికి ఇక్కడి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ల వసూళ్లను ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ రెండు సినిమా లు తమ జోరుని చూపిస్తున్నాయి. సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లో రంగస్థలం చిత్రం 44వ రోజు సైతం ఫస్ట్ షోకు దాదాపుగా హౌస్ ఫుల్ కావడం, 1,18,128 షేర్ రాబట్టడం విశేషం. రోజు మొత్తంలో నాలుగు షోలకు కలిపి ఈ ఆదివారం 2.98 లక్షల కలెక్షన్లు రావడం విశేషం.

మహానటికి దీటుగా రంగస్థలం

ఇక మహానటి అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రెండు థియేటర్లలో తన హవా కొనసాగిస్తుంది. ఈ సినిమా శాంతి థియేటర్లో ఆదివారం మొత్తం 3.03 లక్షలు రాబట్టింది. మయూరి థియేటర్లో 2.92 లక్షలు వసూలయ్యాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకున్న మహానటికి దీటుగా రంగస్థలం వసూళ్లు రాబట్టడం విశేషమే.

Similar News