త్రిష కెరీర్ ఇక చివరిదశలో ఉందా!!

Update: 2016-10-28 18:30 GMT

తమిళనాడులో జయలలిత ఎంత పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలో అందరికి తెలుసు. ఇక ఇప్పుడు జయలలిత హాస్పిటల్ లో వున్నా కూడా ఆమె తమిళనాట రాజకీయం లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యమంత్రి గా ఆమె తమిళనాడులో చక్రం తిప్పింది. జైల్లో ఉన్నా తన కుడి బుజం పన్నీర్ సెల్వం తో తమిళనాట పాలన సాగించింది. ఇక ఇప్పుడు తీవ్ర అనారోగ్యం తో ఉన్నాకూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమించకుండా పన్నీర్ సెల్వానికి తన బాధ్యతలు అప్పజెప్పి ప్రతిపక్షాల నోరు మూయించింది. ఇకఇలాంటి జయలలిత జీవితకథలో నటించాలనుందని ఒక హీరోయిన్ ఉవ్విళూరుతుంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష. త్రిష ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్. ఆమె ఇప్పుడు ఏ స్టార్ హీరో పక్కన నటించడం లేదు. ఎందుకంటే అవకాశాలు రాకపోవడం వల్ల త్రిష కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ కాస్త బిజీగా ఉంది. కానీ ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం త్రిష కోడి సినిమాలో నటిస్తుంది. కాగా ఈ సినిమా ఇప్పుడు విడుదలకి సిద్ధమయ్యింది. ఈ సినిమా పబ్లిసిటీ లో భాగం గా త్రిష అమ్మ బయో పిక్ లో నటించాలనుందని తన మనసులో మాట బయట పెట్టింది. తమిళనాడు రాజకీయాల్లో అమ్మ జయలలిత ముఖ్యమంత్రిగా అందరికి స్ఫూర్తివంతమైంది. ఇక జయలలిత పాత్రలో నటించడం ద్వారా నేను కూడా సీఎం గా కనిపించే ఛాన్స్ నాకు ద‌క్కితే అదే మ‌హాద్భాగ్యం.... అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్రిష ఇలా ఆందో లేదో అప్పుడే దర్శక నిర్మాతలు తెగ ఆలోచించడం మొదలెట్టేసాడు. ఇక త్రిషే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక వాళ్ళు మాత్రం ఆగుతారా. అమ్మ బయో పిక్ ని తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోరూ...!

Similar News