త్రివిక్రమ్ కోసం మారుతున్న తారక్...!

Update: 2018-01-13 09:00 GMT

నిన్ను చూడాలని చిత్రంతో వెండితెరపై హీరోగా పరిచయమైనప్పుడు తారక్ ని చుసిన ప్రేక్షకులు ఇంత భారీ శరీరంతో ఈ తరం హీరోల మధ్య హీరోగా కెరీర్ ఎలా నెట్టుకురాగలడు అని పెదవి విరిచారు. అదే భారీ శరీరంతో స్టూడెంట్ నెం.1 , ఆది, సింహాద్రి వంటి భారీ విజయాల్ని అందుకున్న తారక్ రాఖీ చిత్రంలో తన అవతారానికి భయపడిపోయిన మహిళా ప్రేక్షకులని కూడా తన చిత్రాల వీక్షించటం కోసం థియేటర్స్ కి రప్పించాలని కసితో కొన్ని శస్త్ర చికిత్సల సాయంతో, కొన్ని కఠోర వర్క్ ఔట్స్ తో యమదొంగ చిత్రానికి రూపు రేకలు మార్చుకుని షాక్ ఇచ్చాడు.

స్లిమ్ లుక్ తో....

నాన్నకు ప్రేమతో నుంచి కొద్దిగా ఒళ్ళు చేయటం మొదలుపెట్టిన తారక్ జనతా గ్యారేజ్, జై లవ కుశ చిత్రాలలో కొద్దిగా బొద్దుగానే దర్శనమిచ్చాడు. కాగా తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న తారక్ త్రివిక్రమ్ చెప్పిన క్యారెక్టర్ కి తగిన విధంగా తన లుక్ మలచుకోవటానికి పూర్తిగా స్లిమ్ లుక్ కోసం కష్టపడుతున్నాడట. మళ్లీ యమదొంగ, కంత్రి చిత్రాలలో కనిపించినంత స్లిమ్ గా కనిపించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడట తారక్. మరి యంగ్ టైగర్ లేటెస్ట్ స్లిమ్ లుక్ కి స్క్రీన్ ప్రెజన్స్ ఎలా వుండబోతుందో అంచనాకి రావాలంటే చిత్రం ఫస్ట్ లుక్ విడుదల వరకు ఆగాల్సిందే.

Similar News