త్రివిక్రమ్ కి నచ్చిన హీరోయిన్?

Update: 2017-11-16 12:00 GMT

ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా పూజ కార్యక్రమాలతో ఒక మంచి ముహూర్తాన మొదలైపోయింది. కానీ సినిమా మాత్రం కొంచెం లెట్ గానే సెట్స్ మీదకెళుతుంది. త్రివిక్రమ్.. పవన్ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమాతో సెట్స్ మీదకెళతాడు. ఈ మధ్యలో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా కోసం నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ పనులను చక్కబెట్టస్తాడట. అయితే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్.... అను ఇమ్మాన్యువల్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నాడని ప్రచారం బాగా జరిగింది. కానీ ఎన్టీఆర్ పక్కన అను కాదు డీజే భామ పూజ హెగ్డే అన్నారు. ఇక పూజ హెగ్డే, ఎన్టీఆర్ హీరోయిన్ గా ఫైనల్ అన్నారు. ఇలా ఎన్టీఆర్ పక్కన చాలామంది హీరోయిన్స్ ప్రచారంలోకి రాగా... ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ మరో హీరోయిన్ ని ఎన్టీఆర్ కోసం తెగ ట్రై చేస్తున్నాడంటున్నారు.

అవునా... నిజమా?

మరి త్రివిక్రమ్ కి అంతగా నచ్చిన హీరోయిన్ ఎవరో కాదు... కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్ మెహ్రీన్ కౌర్. వరుసగా మూడు సినిమాల విజయంతో దూసుకుపోతున్న మెహ్రీన్ కౌర్ ని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ భావించి ఆమెని సంప్రదించగా... మెహ్రీన్ డైరీ ఫుల్ అవడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి తన దగ్గర డేట్స్ లేవని చెప్పిందట. కానీ త్రివిక్రమ్, మెహ్రీన్ నే ఎన్టీఆర్ కోసం కావాలని పట్టుబట్టి మరి మెహ్రీన్ కి ఫోన్ మీద ఫోన్స్ చేస్తున్నాడట. మరి ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో జోడి కట్టిన మెహ్రీన్ కి ఎన్టీఆర్ పక్కన నటిస్తే హీరోయిన్ గా నిలదొక్కుకోవచ్చని ఉన్నా కూడా ఆమెకున్న బిజీ షెడ్యూల్ మూలంగా నో చెప్పిందట.

డేట్లు అడ్జెస్ట్ చేసి...

అయితే త్రివిక్రమ్ ఎక్కువసార్లు ఫోన్ చేసి అడగడంతో ఈ ముద్దుగుమ్మ తన డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని టాక్ వినబడుతుంది. అయితే మెహ్రీన్, ఎన్టీఆర్ సినిమాలో నటించే విషయం త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తారట. ఇకపోతే ఇప్పటికే హిట్స్ మీదున్న మెహ్రీన్ కి సన్నాఫ్ సూర్య తో ఎదురు దెబ్బ తగిలింది. అయినా ఆమె నటించిన జవాన్ విడుదలకు సిద్ధం గా ఉండగా... సంఘం సినిమా చేతిలో ఉంది.

Similar News