త్రివిక్రమ్ కన్నా ముందే కాపీ కొడదామనుకున్నాడా?

Update: 2018-01-12 12:00 GMT

ప్రపంచంలో ఏదన్నా సినిమా హిట్ అయితే చాలు మన భారతీయ మూవీ మేకర్స్ దాన్ని కాపీ కోటి మన భాషలు తగ్గట్టు తీస్తుంటారు. ఇలా కాపీ, ఇన్ స్పిరేషన్ల డైరెక్టర్ల జాబితాను తయారు చేస్తే అందులో మన టాలీవుడ్ కి చెందిన త్రివిక్రమ్ ముందుంటాడు. మొన్ననే రిలీజ్ అయిన అజ్ఞాతవాసి కూడా ఫ్రెంచ్ మూవీ నుండి కాపీ కొట్టి తీసిన సినిమానే.

తను కాపీ కొట్టిన విషయాన్ని ఎవరు కనుక్కోలేరు అనుకున్నాడో ఏమో..చాలా కాన్ఫిడెంట్ గా ఆ సినిమాను రిలీజ్ చేయటానికి ట్రై చేసాడు. అప్పటికే ఈ ఫ్రెంచ్ మూవీ సినిమా రీమేక్ రైట్స్ బాలీవుడ్ చెందిన టీ - సిరీస్ వాళ్లు కొనేసుకోడం.. చివరికి అజ్ఞాతవాసి మేకర్స్ టీ సిరీస్ వాళ్లకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రెంచ్ మూవీ ‘ లార్గోవించ్’ను’ మన ఇండియా నుండి చాలా మంది మూవీ మేకర్స్ కాపీ చెయ్యాలని అనుకున్నారట.

అయితే 'లార్గోవించ్’ను కాపీ కొట్టాలని ముందుగా స్కెచ్ వేసింది గౌతమ్ మీనన్ అని తెలుస్తోంది. అయితే ఈ ఫ్రెంచ్ మూవీని గౌత మీనన్ యథాతథంగా తీద్దామని అనుకున్నాడని సమాచారం. గౌతమ్ ఆల్రెడీ హీరోగా విజయ్ ని అనుకున్నాడట. దాని కోసం ఫొటో షూట్ కూడా చేశాడు ఈ దర్శకుడు. స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేశాడు. అలాగే ఈ సినిమాకి ఆ దర్శకుడు ‘యోహన్ -అధ్యాయం ఒండ్రు’ అని టైటిల్ కూడా రెడీ చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసాడంట గౌతమ్. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ.. ఈ సినిమా అంతటితోనే ఆగిపోయింది. ఒకవేళ గౌతమ్ ఈ కథను డీల్ చేసి ఉంటే.. తనదైన శైలిలో యమ సీరియస్ గా తీసేవాడేమో!

Similar News