త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ని ఆలా చూపిస్తాడా?

Update: 2017-10-25 05:27 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఆఫీసియల్ గా ముహూర్తం పెట్టేసుకుంది... ఇక సెట్స్ మీదకెళ్లడమే తరువాయి. ఈ చిత్రం వచ్చే జనవరి నెలాఖరునుండి సెట్స్ మీదకెళుతుందనే టాక్ ఉంది. మంచి రోజులు కావడంతో సినిమాని ముందు మొదలెట్టేసి.. ఆతర్వాత ఆరామ్ గా సినిమాని పట్టాలెక్కించొచ్చనే ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడంటూ సినిమా ఇండస్ట్రీలోని జనాలే కాకూండా ఎన్టీఆర్ అభిమానులల్లోను తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది.

అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లోని హీరోలను కామెడీతోపాటే యాక్షన్.... కుటుంబానికి విలువనిచ్చే పాత్రల్లోనె హీరోలను చూపెడుతుంటాడు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పొలిటికల్ బ్యాగ్ద్రోప్ ఉన్న కథతో వస్తున్నాడని.. కాదు కాదు ఒక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లోనే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం జోరుగా జరిగింది. కానీ త్రివిక్రమ్ మాత్రం తన పాత సినిమాల ఫార్ములాతోనే ఎన్టీఆర్ సినిమా కథని ప్రిపేర్ చేస్తున్నాడట. ఈ సినిమా కథ మొత్తం కుటుంబం నేపథ్యంలోనే.... అందమైన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఓ చక్కటి ప్రేమకథను ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్రజెంట్ చేయబోతున్నాడట.

త్రివిక్రమ్ తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ జోనర్ నే మళ్ళీ ఎన్టీఆర్ సినిమాకి కూడా ఎంచుకున్నాడట. త్రివిక్రమ్ సినిమాలంటేనే కుటుంబంతో కలిసి కూర్చుని చూసి ఎంజాయ్ చేసే సినిమాలని అందరికి తెలిసిందే. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుందన్నమాట. ఇక ఎన్టీఆర్ కూడా బృందావనం సినిమా తర్వాత ఎటువంటి కుటుంబం కథా చిత్రము చెయ్యలేదు. ఇక ఇప్పుడు త్రివిక్రంతో మరోసారి ఒక మంచి కుటుంబం కథ చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి రాబోతున్నాడన్నమాట.

Similar News