తొలి సినిమా విడుదల కాకముందే బడా ఆఫర్లు

Update: 2018-01-31 12:30 GMT

మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం కాబోతున్న వెంకీ కుడుమల ఇప్పటికే చలో ట్రైలర్ లతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇంకా చిత్రం విడుదల కానప్పటికీ ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలలో కూడా ఈ నూతన దర్శకుడిపై మంచి అభిప్రాయమే ఏర్పడింది. ఆయన ట్రైలర్ లో చిత్ర కధ తెలిపేలా చేసి ఆ కథాంశం తో ఆకట్టుకోవటమే ఇందుకు కారణం.

అడ్వాన్స్ లు ఇచ్చి మరీ...

చలో చిత్రం ఇంకా విడుదల కానప్పటికీ ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ దర్శకుడికి అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వీరిలో ప్రథమంగా అల్లు శిరీష్ హీరోగా వెంకీ దర్శకత్వంలో ఒక చిత్రం కోసం గీత ఆర్ట్స్ ప్రయత్నిస్తుండగా, మరో అగ్ర నిర్మాణ సంస్థ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక చిత్రానికి ప్రయత్నిస్తోంది. అయితే చలో బాగా ఆడితే ఇబ్బంది లేదు కానీ ఒకవేళ ఫలితం అటు ఇటు అయ్యే లోపు వెంకీ ఈ ఆఫర్స్ కాష్ చేసుకుంటే మంచిది. లేకపోతే సినిమా కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి మరి.

Similar News