తెలుగు సినిమా మార్కెట్ పైనా యుద్ధం

Update: 2016-11-22 16:41 GMT

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వెండి తెర పైనా, బుల్లి తెర పైనా ఏమి చేసినా అది కచ్చితంగా సంచలనమే. ఆమిర్ ఖాన్ చిత్రాలు కోసం చిత్రీకరణ ప్రారంభం అయిన నాటి నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఆమిర్ అభిమానులు...కాదు కాదు సినిమా అభిమానులు ఎందరో. అయితే పీకే వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత ఆమిర్ ఖాన్ ఎంచుకున్న కథ లోని ఆయన పాత్ర కోసం శారీరకంగా సిద్దపడటానికి ఆమిర్ కు దాదాపు పది నెలల సమయం పట్టింది. దీనితో 2015 లో ఆమిర్ చిత్రం ఏది విడుదల కాలేదు.

హిందీ లో రేస్లర్ జీవిత కథగా తెరకెక్కిన దంగల్ చిత్రాన్ని తెలుగు లో యుద్ధం పేరుతో అనువదించారు. డిసెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న దంగల్ హిందీ వెర్షన్ తో పాటే ఈ యుద్ధం విడుదల కానుంది. అదే సమయానికి విడుదల అవుతున్న నేను లోకల్ వంటి అనేక తెలుగు చిత్రాలపై ఆమిర్ ఖాన్ యుద్ధం పెద్ద యుద్ధమే చేయనుంది. ఫస్ట్ కాపీ సిద్దమైన రోజునే సినిమా విశ్లేషణ ఇచ్చేసి ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కారం జోహార్ దంగల్ పై అప్పటికే భారీగా వున్న అంచనాలను తార స్థాయికి చేర్చేసాడు. ఈ తరుణంలో దంగల్ చిత్రం ఎన్ని చిత్రాల మార్కెట్ పై ప్రభావం చూపుతుందో అనే చర్చ సినీ వర్గాలలో మొదలైయ్యింది.

Similar News