తెలుగు అమ్మాయి తమిళ ఇంటికి కోడలు కాబోతోందా?

Update: 2017-03-29 11:02 GMT

తెలుగు అమ్మాయి అంజలిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన తమిళ చిత్రం జర్నీ. ఆ చిత్రంలో అంజలికి జంటగా నటించిన తమిళ యువ కథానాయకుడు జై తో అంజలి వ్యక్తిగతంగా బాగా చనువుగా ఉంటోందని గత కొద్ది నెలలుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ కోలీవుడ్ పెయిర్ గురించి ప్రస్తావించని తమిళ మీడియా ఛానల్ ఉండదేమో. అంతలా పబ్లిసిటీ పొందిన ఈ ప్రేమ జంట మాత్రం తమ మధ్య వున్న బంధానికి ఎటువంటి పేరుని ఆపాదించుకోకుండా ఏ ఇంటర్వ్యూ లో ఈ విషయమై ప్రశ్న ఎదురైనా సమాధానం చెప్పకుండా దాట వేస్తూ వస్తున్నారు. ఆ మధ్య జై ఇంట్లో వంట చేస్తూ దొరికిన అంజలి వీడియోస్ ని చూసి వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా వచ్చింది.

అయితే కొద్ది రోజుల క్రిందట ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అంజలి ఈ విషయమై స్పందిస్తూ తనకి జై కి మధ్యన వున్న అనుబంధంపై వస్తున్న వార్తలన్నీ ఖండించింది. మీడియాలో వచ్చే వార్తలనే నమ్మితే ఇప్పటికే తనకి ఒక నిర్మాతతో వివాహం పూర్తయిపోయింది అని కూడా నమ్మాలి కదా అని ఎదురు ప్రశ్నించింది. ఆ మధ్య అంజలి సినీ పరిశ్రమకి చెందిన ఓ నిర్మాతని వివాహమాడిందనే పుకార్లు హల్చల్ చేసిన సంగతి విదితమే. అప్పటికి చిత్రంగధ ప్రమోషన్ కోసం ఒకింత ఘాటుగా ఈ ప్రశ్నని మలుచుకున్నప్పటికీ అంజలికి ఇదేమి కలిసిరాలేదు. అయితే ఇప్పుడు అంజలి సన్నిహితులు మాత్రం ఇప్పటికే వీరి ప్రేమాయణం పెద్దల వరకు చేరిందని, వారందరి సమ్మతితోనే వచ్చే ఏడాది ఆఖరు లోపు అంజలికి జై తో వివాహం జరుగుతుందని చెప్తున్నారు. మరి అంజలి ఈ విషయమై ముహుర్తాలు ఖరారు అయ్యే వరకు వాస్తవాలు వెల్లడించదేమో.

Similar News