తెలుగు అమ్మాయి చెన్నైలో జంటని ఎప్పుడు ఖరారు చేస్తుందో?

Update: 2017-04-09 09:00 GMT

స్వతహాగా తెలుగు అమ్మాయి అయినప్పటికీ అంజలి కోలీవుడ్ ద్వారానే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. తమిళ చిత్ర పరిశ్రమ లోనే గుర్తుండిపోయే చిత్రాలలో నటించిన అంజలి తెలుగు లో అడపాదడపా నటిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఫామిలీ ఎంటర్టైనర్ లో మిడిల్ క్లాస్ లేడీ ఆడియెన్స్ కి బాగా చేరువైన సీత పాత్రలో మెప్పించి నేటికీ కూడా ఆ పాత్ర ద్వారానే గుర్తింపు పొందుతుంది. మధ్యలో గీతాంజలి వంటి హిట్ మూవీ ఖాతాలో వేసుకున్నప్పటికీ అంజలి కెరీర్ తెలుగులో ఆశించిన స్థాయిలో సాగలేదు. లేటెస్ట్ గా వచ్చిన చిత్రంగాధ చిత్రంలో విమెన్ సెంట్రిక్ ఫిలిం చేసినప్పటికీ అంజలి కి విజయం వరించలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది అంజలి.

సినిమా కెరీర్ తో పాటు వ్యక్తిగత కెరీర్ ని కూడా మద్రాస్ కే పరిమితం చేసేసుకుంటుంది అంజలి. జర్నీ చిత్రం తో తనకి తొలి సారి జంటగా నటించిన జై తో రహస్య ప్రేమాయణం సాగిస్తున్న అంజలి ఇప్పటి వరకు జై వ్యవహారాన్ని ఖరారు చెయ్యలేదు కానీ అతగాడి ఇంట్లో వంటి చేస్తూ, ఇప్పుడు తాజాగా జై పుట్టిన రోజు సందర్భముగా జై చేస్తున్న సినిమా సెట్స్ కి వెళ్లి అక్కడ కేక్ కట్ చేపించి జైకి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది అంజలి. మరి ఈ వ్యవహారాల్ని చూసిన తరువాత కూడా తమ మధ్య ఏమి లేదని చెప్తున్నా అంజలి-జై లు గుట్టు రట్టు చేసేలా వారే ప్రవర్తించి ఇది కేవలం స్నేహమే అని ఎంత కాలం నెట్టుకొస్తారో. మరో వైపు అంజలి-జై లకి ఇప్పటికే వివాహం జరిగిపోయిందని పలు కోలీవుడ్ మీడియా చానెల్స్ కోడై కూస్తుండగా, కోలీవుడ్ లో అంజలి-జై ల సన్నిహితులు వచ్చే ఏడాదిలో వారి వివాహం ఉంటుందని చెప్తున్నారు. మరి అసలు వారు ఎంత కాలానికి స్పందిస్తారో చూడాలి.

Similar News