తాప్సీ కొత్త కోటి కారు!!

Update: 2017-10-06 08:00 GMT

సినిమా సెలబ్రిటీస్ అయినా.... మాములు సెలబ్రిటీస్ అయినా తమ ఇళ్లల్లో అందరికన్నా ఎక్కువగా ఎంతో కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. అందుకే వారు ఎక్కువగా మార్కెట్ లోకి వచ్చిన కార్ల దగ్గరనుండి అన్ని కొత్తగా ఉండాలని కోరుకుంటుంటారు. మరి అలా మర్కెట్ లోకి వచ్చిన కార్లు కొనుక్కుంటూ పొతే నాలుగైదు కారులు ఖచ్చితంగా ఆ ఇంటి కార్ షెడ్ లో ఉంటాయి. ఈతరహా కొత్తదనాన్ని ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ ఇష్టపడుతుంటారు. వారి మార్కెట్ లోకి వచ్చిన కొత్త కార్లను లాంచ్ చెయ్యడమే కాదు ఎప్పటికప్పుడు వాటిని కొనేస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తుంటారు.

తాప్సీ కొత్త కారు....

అక్కడ బాలీవుడ్ లో హీరోయిన్స్ కూడా రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతుంటారు. అయితే వారిలో ఎక్కవగా ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే వంటి స్టార్ హీరోయిన్స్ ఈ కార్లలో తిరుగుతుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్ లో కూడా టాప్ హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అవగానే వారు కూడా ఒక కొత్త కారు కోనేస్కుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటికిమొన్న రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డేలు కొత్త కార్లు కొనుక్కుని మరి ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు రెండేళ్ల క్రితమే బాలీవుడ్ లోకి అడుగుపట్టిన తాప్సి కూడా ఒక కొత్త కోటి కారుని కొనేసి వావ్ అనిపించేసింది.

కారు పేరు మార్గరెట్......

2015 లోనే కొత్త బి.ఎం.డబ్లూ కార్ కొనుక్కొని తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న తాప్సి ఇప్పుడు తాజాగా కోటి రూపాయాలు విలువ చేసే మెర్సిడీజ్ బెంజ్ కారు ఒకటి కొనేసుకుని... ఆ కారు మీద పడుకుని మరీ ఫోటోలకు ఫోజులిచ్చేసింది. మరి ఈ రేంజ్ లో కార్లు కోనేస్తుంది అంటే... తాప్సి బాలీవుడ్ లో గట్టిగానే సంపాదిస్తుంది. జుడ్వా 2 లో బికినీ షోతో అదరగొట్టిన తాప్సి ఇప్పుడు కారుని కొనుక్కుని ఆ కారుకి ఒక అందమైన పేరు పెట్టి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ కారుకి మార్గరెట్ అంటూ పేరు పెట్టి.. మా కొత్త ఫ్యామిలీ మెంబెర్ అంటూ వంకర్లు పోతుంది తాప్సి.

Similar News