తాను ఆ సినిమాకు సరిపోనని అభిప్రాయపడ్డ డైరెక్టర్

Update: 2018-03-30 10:00 GMT

లేట్ నందమూరి తారక రామారావుపై బయోపిక్ నిన్న ఉదయం రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభం అయింది. సినిమా పూజ, ప్రారంభ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గా తన కొడుకు బాలకృష్ణ నటిస్తుండగా.. తేజ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు ఎన్.టీ.ఆర్. అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టాడు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తేజ చెప్పిన మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అసలు అలాంటి చరిత్రకారుడి సినిమాకు దర్శకత్వం వహించేందుకు తాను సరిపోనని అభిప్రాయపడ్డాడట తేజ. కానీ నేను చేయగలను అనే నమ్మకం బాలయ్యకి కలిగించడంతో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న అని చెప్పాడు. ఈ సినిమా కథ అద్భుతంగా కుదిరిందని మీరందరు గర్వపడేలా ఉంటుందని చెప్పాడు తేజ.

ఈ సినిమాను అన్ని కుదిరితే దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని తేజ అన్నారు. ఈ చిత్రంలో బాలయ్య 70కి పైగా గెటప్స్ లో కనిపించనున్నారని ఇప్పటికే న్యూస్ ఉంది. మరి ఈ లెక్కన ఈ సినిమా షూటింగ్ ఎంత వేగంగా ప్లాన్ చేసారో అర్ధం అవుతుంది

Similar News