తమ్మూ కోసం పోటీ పడుతున్న స్టార్ హోటల్స్

Update: 2016-11-25 15:51 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ బాగా తక్కువ ఐనప్పటకీ తమన్నా భాటియా కు ప్రేక్షకులలో అధిక ఫాలోయింగ్ ఉండటానికి కారణం తమన్నా డాన్స్. తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, రామ్ వంటి ఎనర్జిటిక్ డాన్సర్లుకి పోటీగా తెరపై విజృంభించిన సందర్భాలు తమన్నా కెరీర్లో చాలానే వున్నాయి. మరో పక్క బడా బాబుల వారసులుగా వెండి తెరకు పరిచయం అయ్యే కథానాయకులకు తమన్నా స్పెషల్ డాన్స్ అట్రాక్షన్ అవుతుంది. అల్లుడు శీను, జాగ్వార్ వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరో పక్క బిగ్ షాట్స్ ఇంట వేడుకలకు, ప్రైవేట్ పార్టీ లకు తమన్నా డాన్స్ కు డిమాండ్ ఎక్కువ అయిపోయింది. ఇటీవల జరిగిన గాలి వారి ఇంట పరిణయ వేడుకకు తమన్నా ఒక్క సాయంత్రం చేసిన నృత్యానికి అధిక మొత్తాన్నే పారితోషికంగా అందుకుంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలకటానికి మధ్యన ఒక నెల మాత్రమే మిగిలి ఉండటంతో ప్రముఖ స్టార్ హోటల్స్ అన్నీ వారి ఈవెంట్స్ కోసం తమన్నా కాల్ షీట్ కోసం ప్రయత్నిస్తుండగా తమన్నా ఆ సదావకాశాన్ని మద్రాస్ పట్టణంలోని ఒక సెవెన్ స్టార్ హోటల్ వారికి కలిపించింది అని సమాచారం. ఈ సింగల్ ఈవెంట్ కి తమన్నా అందుకుంటున్న పారితోషికం ఒక కోటి పాతిక లక్షలు అంట.

రెండు నెలలు కాల్ షీట్స్ కేటాయిస్తే తప్ప ఒక్కో చిత్రానికి కోటి రూపాయలు పారితోషికం అందకపోవటంతో ఇటువంటి సింగల్ ఈవెనింగ్ ఈవెంట్స్ కు తనకు వున్నా డిమాండ్ ని బాగానే కాష్ చేసుకుంటుంది ఈ మిల్కీ బ్యూటీ.

Similar News