తమ్ముడికి ప్లాపిచ్చింది... మరి అన్నకి

Update: 2017-08-29 11:00 GMT

టాలీవుడ్ లో తమన్నా కి ఓ... అని చెప్పుకునే హిట్స్ లేకపోయినా.. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. హీరోలెవరు వరుసబెట్టి అవకాశాలు ఇవ్వకపోయినా కూడా చానళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాతుకుపోయింది. కానీ కొత్త తరం హీరోయిన్స్ రాకతో అమ్మడుకి అవకాశాలు తగ్గిపోయాయి. బాహుబలి సీరీస్ తర్వాత దాదపు ఖాళీ అయిన తమ్మూకి కళ్యాణ్ రూపంలో ఒక ఆఫర్ వచ్చింది. కళ్యాణ్ రామ్ జయేంద్ర దర్శకత్వంలో చేస్తున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తమన్నాని హీరోయిన్ గా తీసుకున్నాడు.అయితే తమన్నాకి చాలాకాలం తర్వాత వచ్చిన ఈ ఆఫర్ ని ఒప్పేసుకుంది.

అలాగే ఎన్టీఆర్ 'జై లవ కుశ' లో మిల్కి బ్యూటీ తమ్ము స్పెషల్ సాంగ్ లో మెరవనుందని గత రెండు రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి వుంది. ఎన్టీఆర్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ అంటే నమ్మబుద్దికావడంలేదంటున్నారు. ఎందుకంటే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ - తమన్నా కాంబోలో వచ్చిన 'ఊసరవెల్లి' చిత్రం ప్లాపవ్వడంతో ఎన్టీఆర్ మళ్ళీ తన సినిమాల్లో తమన్నాకి ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటపుడు తన 'జై లవ కుశ'లో మాత్రం ఎలా ఆఫర్ ఇస్తాడంటున్నారు.

ఇకపోతే తమ్ముడికి కలిసిరాని హీరోయిన్ కి అన్న కళ్యా రామ్ అవకాశం ఇచ్చి తప్పు చేశాడా? అనే అనుమానంలో ఉన్నారట నందమూరి ఫాన్స్. చూద్దాం తమ్ముడికి ప్లాపిచ్చిన తమ్ము అన్న కళ్యాణ్ కి అయినా హిట్ ఇస్తుందేమో..!

Similar News