తమిళ నేటివిటీ తో దూసుకొస్తున్న 38 ఏళ్ల కథానాయిక

Update: 2017-03-01 09:51 GMT

తమిళ నటుడు సూర్య తో వివాహం అనంతరం తన వైవాహిక జీవితం కోసం వృత్తిపరమైన జీవితానికి దాదాపు దశాబ్ద కాలం దూరంగా వుంది ప్రముఖ కథానాయిక జ్యోతిక. తన ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కావటంతో తన వ్యక్తిగత జీవితపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే నట జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మలయాళం లో బాగా ఆడిన ఒక మధ్య వయస్కురాలి చుట్టూ తిరిగే కథని తమిళంలోకి రీమేక్ చేసి '36 వయధినిలే' అనే పేరుతో తాను లీడ్ రోల్ పోషించిన చిత్రాన్ని 2015 లో విడుదల చేసింది జ్యోతిక. అయితే మళయాళ ప్రేక్షకులని ఆకట్టుకున్న స్థాయిలో ఈ కథ తమిళ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది.

తన నట జీవితంలో రీ ఎంట్రీ వైఫల్యం చెందినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా తిరిగి లేడీ ఓరియెంటెడ్ కథనే ఎంచుకుని అందులో లీడ్ రోల్ పోషిస్తోంది. అయితే ఈ సారి విజయాపజయాలకు సంబంధం ఉందని ప్రాజెక్ట్ లో భాగం ఐయ్యింది జ్యోతిక. ప్రముఖ తమిళ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న నాచ్చియార్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదల ఐయ్యింది. ఈ పోస్టర్లో పూర్తిగా తమిళ నేటివిటీ వున్న పాత్రలో జ్యోతిక కనిపించనుందని అర్ధం అవుతుంది. సహజంగా బాల దర్శకత్వంలో వచ్చే చిత్రాలకు బాక్స్ ఆఫీస్ వసూళ్ల తో పని ఉండదు. ఆయన చిత్రాలలో కథ ఫోర్ గ్రౌండ్ లో కనిపించినప్పటికీ నటీనటులకు పెరఫార్మెన్సు లకి బాగా స్కోప్ దొరుకుతుంది. అలానే ఆయన ఎగ్జిక్యూషన్ ప్రతి సారి విమర్శకులను తృప్తి పరుస్తూనే ఉంటుంది. కాబట్టి జ్యోతిక నటిస్తున్న నాచ్చియార్ చిత్రానికి విజయం వరించినా లేకపోయినా నటిగా మాత్రం గొప్ప గౌరవం దక్కటం ఈ పోస్టర్తో ఖాయం గా కనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం ప్రభావం చూపగలిగితే ఇక అది బోనస్.

Similar News