తమాషా అర్ధంతో టైటిల్ ఖరారు

Update: 2016-12-06 06:26 GMT

జయం చిత్రంతో పరిచయమవుతూనే సూపర్ సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు నితిన్ తదుపరి చిత్రాలు దిల్, సై లతో కూడా ప్రేక్షకులను అలరించాడు. అప్పటినుంచే నితిన్ కు గడ్డు కాలం మొదలయింది. వరుసగా 12 అపజయాలు కెరీర్ ను కుంగదీసినప్పటికీ చెదరని ఆత్మ విశ్వాసంతో ప్రయత్నాలు సాగిస్తూ ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే లతో మల్లి సక్సెస్ ట్రాక్ పట్టాడు. ఇటీవల వచ్చిన అఆ చిత్రంతో ౪౮ కోట్ల రూపాయల షేర్ సాధించి ట్రాక్ రికార్డు గా నిలుపుకున్నాడు. అంతటి భారీ విజయం తరువాత చేయబోయే చిత్రాన్ని ఆచి తూచి ఎంచుకున్నాడు నితిన్. కథానాయకుడిగా అగ్ర దర్శకులతో పని చేస్తూనే, ఇతర స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నాడు నితిన్. అఖిల్ చిత్రంతో అక్కినేని అఖిల్ ని పరిచయం చేసిన నితిన్ ఇప్పుడు త్రివిక్రమ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సమర్పణలో నిర్మితమవుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్య రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మూడు ఆంగ్ల అక్షరాల పేరు LIE ను ఖరారు చేశారు. దాని అర్ధం అబద్దం అని కాదంట. లవ్ ఈజ్ ఎండ్లెస్ అనే వాక్యంలో మొదటి ఆంగ్ల అక్షరాలను తీసుకుని టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తుంది. 2017 వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందు విడుదల కానుంది.

Similar News