తన స్టైల్ లో రివ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Update: 2018-04-01 10:40 GMT

సినిమా నచ్చితే ఎవరికి నచ్చినట్టు వారు ఓన్ రివ్యూస్ ఇస్తుంటారు సోషల్ మీడియాలో. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వచ్చాకా ఎవరికి నచ్చినట్టు వారు రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసారు. సినిమా బాలేపోతే బాగోలేదు అని చెప్పటం...బాగుంటే బాగుందని చెప్పటం సోషల్ మీడియాలో కామన్ అయిపోయింది. అయితే ఈమధ్య స్టార్స్ కూడా సినిమా రివ్యూస్ తమ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ. శుక్రవారం రిలీజ్ అయ్యిన రంగస్థలం సినిమాకు మనోడు ఇచ్చిన సరికొత్త రివ్యూ మెగా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. సినిమాలో అన్ని అంశాలకు A రేటింగ్ యాడ్ చేశాడు. రంగస్థలం - A! - పెర్ఫెమెన్స్ A - దర్శకత్వం A - కెమెరా A - సంగీతం A - ప్రొడక్షన్ A. అనే రేటింగ్ ఇచ్చి చిత్ర యూనిట్ ని స్పెషల్ గా పొగిడాడు.

దీంతో పాటు స్పెషల్ ఎమోజీలను యాడ్ చేసి స్పెషల్ గా ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ ఇచ్చిన రివ్యూ తెగ నచ్చడంతో సోషల్ మీడియాలో ఉన్న తన ఫాలోవర్స్ కూడా సూపర్ రివ్యూ అని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రంగస్థలం హడావిడి నడుస్తుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Similar News