తన వ్యక్తిగత విషయాలు తీస్తే ఊరుకోదట

Update: 2018-03-30 07:53 GMT

ఏమైనా చెయ్యండి కానీ నా పర్సనల్ విషయాల్లోకి తొంగి చూస్తే అస్సలూరుకోనని చెబుతుంది గోవా బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిన ఇలియానా నిజజీవితంలోనూ తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కానీ తనకి పెళ్లయింది అని ఎక్కడా ఇలియానా ఒప్పుకోదు. మల్లి ఎమన్నా అంటే పర్సనల్ విషయాలను కెలికితే ఊరుకోనని వార్నింగ్ ఒకటి. తాజాగా ఇలియానా తనకున్న ఒక ఆరోగ్య సమస్యను బయటికి చెప్పడానికి ఏమాత్రం సంకోచించనని... అలాగే సిగ్గుపడను అని కూడా చెబుతుంది.

ఇలియానా గత 15 ఏళ్లుగా 'బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ)' తో బాధపడుతుందట. అయితే తనకి ఈసమస్య ఉందని.. దానిని దాచి పెట్టడం వలన తానింకా సమస్యలు ఎదుర్కోవడమే కాదు... చెప్పడానికి సిగ్గుపడితే అదింకా మానసిక సమస్యగా మారుతుందని... అందుకే అలాంటివి దాచిపెట్టలేనని... ఇలాంటివి బహిరంగంగా చెప్పడానికి తానేమి సిగ్గుపడనని చెబుతుంది. అయితే తనకి అలాంటి ఓ అనారోగ్య పరిస్థితి ఉందని జనాలకు తెలిస్తే వారు చూసే చూపు వలన ఎక్కువగా బాధకలుగుతుందని చెబుతుంది ఇలియానా. ఇలా తన అనారోగ్య పరిస్థితిని బయటపెట్టిన ఇలియానా తన వ్యక్తిగత విషయాలలో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉంటానని చెబుతుంది.

మీడియాలో తన వ్యక్తిగత జీవితం మీద వచ్చే గాసిప్స్ తనకు అస్సలు ఇష్టముండదని ...తన మీద కామెంట్స్ చేసే రైట్స్ ఎవ్వరికి లేదని చెబుతుంది. తన వ్యక్తిగత జీవితం చాలా పవిత్రమైనదని.. అందులో చాలా పార్శ్వాలు ఉన్నాయని ఆమె తెలిపింది. అలాగే తానెప్పుడన్నా ఈ విషయాలనూ మాట్లాడదాం అంటే అందులోని మంచి విషయాలను గాలికొదిలేసి.. అనవసర విషయాలని పట్టుకుని వేళ్ళాడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ చిన్నది.

Similar News