తన అభిమానికి అభిమానిగా మారిన కథానాయిక

Update: 2017-03-17 08:46 GMT

బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని అనుభవంగా ఏర్పరచుకున్న కరీనా కపూర్ ఖాన్ ఇటీవలి కాలంలో ఒక బిడ్డకు జన్మనివ్వటంతో కొంత కాలం సినిమా చిత్రీకరణలకు విరామం ఇచ్చింది. కరీనా కపూర్ తిరిగి నటించాలని కోరుకునే కోట్లాది అభిమానుల్లో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ కూడా ఉంటుంది. ఎన్నో సందర్భాలలో కరీనా కపూర్ తన అభిమాన కథానాయిక మాత్రమే కాదని తనకి రోల్ మోడల్ కరీననే అని చెప్పింది అలియా భట్. పన్నెడు సంవత్సరాల వయసు వ్యత్యాసం వీరిద్దరి మధ్య వుంది. తాను కరీనా కపూర్ నటన చూస్తూ పెరిగానని, అసలు సినిమాల్లో నటించాలన్న కోరిక తనకు కలిగింది కరీనా వల్లనే అని చెప్పే అలియా భట్ ఇప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

తాజాగా బొంబాయి లో జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ హీరోయిన్ గా అలియా భట్ ఎంపిక ఐయ్యింది. కాగా ఆ అవార్డ్స్ వేడుకకి అతిధిగా విచ్చేసిన కరీనా కపూర్ చేత అలియా భట్ కి అవార్డు ప్రధానం చెఇంచారు నిర్వాహకులు. అలియా భట్ కి అవార్డు అందజేయటానికి వేదికపైకి వచ్చిన కరీనా కపూర్ మాట్లాడుతూ, "ఇప్పుడు ఆలియా భట్ నాకు అభిమాని కాదు. నేను తనకి అభిమానిని ఐపోయాను. మా రోల్స్ రివర్స్ అయిపోయాయి. ఆలియా భట్ ఒక్కో సినిమాకి నటనలో చూపుతున్న వైవిధ్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైగా తన సినిమాల ఎంపిక ఎంతో ప్రత్యేకం. ఎన్నో రిస్క్ తో కూడుకున్న పాత్రలను ఛాలెంజ్ గా తీసుకుని తనని తాను నిరూపించుకుంటుంది." అంటూ తన అభిమాని ఐన ఆలియా భట్ నటనకి కితాబు ఇచ్చి, అవార్డు అందజేసింది కరీనా కపూర్.

Similar News