డాషింగ్ డైరెక్టర్ కి ఓవర్ సీస్ లో ఘోర అవమానం

Update: 2017-04-06 05:43 GMT

ఓవర్ సీస్ లో తెలుగు సినిమాలు చూసే ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యూ.ఎస్.ఏ లో తెలుగు సినిమా ప్రేక్షకులు హీరో స్టార్ స్టేటస్ కంటే ఎక్కువగా డైరెక్టర్ క్రెడిబిలిటీ మీద సినిమాలు చూస్తుంటారు. ఎందుకంటే వారు హీరోయిజం ఎలివేట్ అయ్యే సినిమాలకంటే దర్శకుడి సృజనాత్మకత కనపరిచే చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. అందుకే చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా సినిమా బాగుంటే ఏ హీరో సినిమా అయినా అక్కడ విజయం సాధిస్తుంటుంది. అలాంటిది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వంటి రెప్యుటేషన్ వున్న దర్శకుడు తెరకెక్కించిన సినిమా యూ.ఎస్.ఏ మార్కెట్ లో చేసిన కలెక్షన్ వింటే కంగుతినని వారుండరు.

గత వారం రోగ్ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో విడుదల చెయ్యగా తెలుగు రాష్ట్రాలలో పరాజయం చవి చూసిన ఈ చిత్రానికి ఓవర్ సీస్ మార్కెట్ లో అయితే పెట్టుబడిలో ఒకటో వంతు కూడా తిరిగి రాకపోవటం గమనార్హం. తొలి నాలుగు రోజులు మాత్రమే యూ.ఎస్.ఏ లోని థియేటర్స్ లో ప్రదర్శితమైన రోగ్ చిత్రం కేవలం 330 డాల్లర్ల వసూళ్లు చేసింది. అంటే మన కరెన్సీ లో 22 వేల రూపాయలు. స్టార్ హీరోస్ తో సినిమాలు చేసిన అనుభవం వున్న దర్శకుడు, పైగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డు వున్న దర్శకుడు, దాదాపు 8 కోట్ల రూపాయల పారితోషికం పుచ్చుకునే పూరి జగన్నాథ్ సినిమా ఒక దేశం మొత్తం మీద 22 వేల రూపాయల వసూళ్లతో బిజినెస్ ముగిసిపోవడం అంటే పూరి జగన్నాథ్ కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదేమో.

Similar News