డబ్బు ఖర్చు లేని పెళ్లి!

Update: 2018-04-25 04:52 GMT

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బిజినెస్ మ్యాన్ ఆనంద్‌ ఆహూజాలు చాలా కాలంగా ప్రేమలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు పెద్దలని ఒప్పించి త్వరలోనే అంటే వచ్చే నెల మొదటివారంలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ లో బాగా బిజీగా వున్న సోనమ్ కపూర్ ట్రెడిషనల్ అండ్ గ్లామర్ డ్రెస్సులతో బాగా ఎట్రాక్టివ్ గా సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతూ అందరిని కనువిందు చేస్తుంది. ఫ్యాషన్ ఐకాన్ అయిన సోనమ్ కపూర్ ఎంత రిచ్ గా... ఎక్కడ ( స్విట్జర్లాండ్‌ లేదా ముంబైలో) పెళ్లి చేసుకుంటుందో అని అందరూ ఎదురు చూడడమే కాదు... సోనమ్ ఎక్కడ కనబడితే అక్కడ ఇదే ప్రశ్నలతో ఆమెను వేదిస్తున్నారట.

అయితే ఎట్టకేలకు ఈ హీరోయిన్ తన పెళ్లి విషయమై స్పందించింది. పెళ్లి చేసుకుంటే ఇంట్లోనే పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి వేడుక కోసం కోట్లు ఖర్చు పెట్టాలేనని... అందుకే పెళ్లి ని చాలా సింపుల్ గా అతిధుల మధ్యలోనే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేస్తుంది ఈ హాట్ ఫ్యాషన్ ఐకాన్. ఇక గ్రాండ్ గా పెళ్లికి అయ్యే డబ్బుని కావాలంటే విరాళంగా ఇస్తానని చెప్పిన సోనమ్ కపూర్.... తక్కువ ఖర్చుతో పెళ్లికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పద్ధతిగా జరగాలని.... అందుకే ఇంట్లోనే పెళ్లి చేసుకోని, పద్ధతులు పాటించాలని డిసైడ్ అయినట్టు తెలిపింది. మరి వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే పెళ్లి వేడుకలకు అనిల్ కపూర్ ఇంట అపుడే పెళ్లి పనులు మొదలైపోయాయి.

ఇప్పటికే సంగీత్ కి సంబందించిన డాన్స్ ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫేర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్ ఆధ్వర్యంలో మొదలైపోయాయి కూడా. ఇప్పటికే డాన్స్ రిహార్సల్స్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. మరో పది రోజుల్లోనే సోనమ్ కపూర్ పెళ్లి కూతురైపోతుంది. మరి బాలీవుడ్ దిగ్గజాల ఇంట పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతాయో.. వాటికీ భిన్నంగా సోనమ్ కపూర్ తన పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోబోతుంది.

Similar News