డబ్బింగే అయినా అంచనాలు చాలా ఉన్నాయ్!

Update: 2016-11-09 04:32 GMT

డబ్బింగ్ సినిమాలు హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదల కావడం అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఫరెగ్జాంపుల్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్లు నటించిన చిత్రాలు శివాజీ, కబాలి, రోబో వంటి చిత్రాలకు మాత్రమే.. విడుదలకు ముందే డబ్బింగ్ అయినా సరే.. పాజిటివ్ మార్కెట్ క్రియేట్ అయి టేబుల్ ప్రాఫిట్ తో విడుదల అవకాశాలు ఏర్పడుతుంటాయి. కానీ ఓ చిన్న హీరో డబ్బింగ్ చిత్రం కూడా.. విడుదలకు ముందే ఓ మోస్తరు క్రేజ్ ను సంపాదించుకుంటున్నదే ఆశ్చర్యకరమే. ఈ అరుదైన ఫీట్ ను తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలుగు పరిశ్రమలో సాధిస్తున్నాడు.

విజయ్ ఆంటోనీ సైలెంట్ కిల్లర్ లాగా చిత్రవిజయాలను నమోదు చేయడంతో బాగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులోకి డబ్బింగ్ అయిన విజయ్ ఆంటోనీ గత చిత్రాలు కూడా అతనికి బాగా పేరు తెచ్చి పెట్టాయి. గతంలో సలీమ్, ప్రత్యేకించి ఇటీవల వచ్చిన బిచ్చగాడు చిత్రాలు తెలుగులో బాగా ఆడాయి. బిచ్చగాడు అయితే.. అనూహ్యంగా సూపర్ హిట్ విక్టరీని నమోదు చేసింది. బిచ్చగాడు తర్వాత విడుదలైన తెలుగు స్టార్ హీరోల చిత్రాలు థియేటర్ల నుంచి ఎత్తేసిన తర్వాత కూడా బిచ్చగాడు ఆడుతూనే ఉన్నదంటే.. అది ఏ రేంజి విజయానికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి నేపథ్యంలో విజయ్ ఆంటోనీ తాజా చిత్రం భేతాళుడు కూడా తెలుగులో భారీ అంచనాల మధ్యనే విడుదల అవుతోంది. నేరుగా విజయ్ ఆంటోనీకి ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ గానీ, ఫాన్ ఫాలోయింగ్ గానీ ఏమీ లేకపోయినప్పటికీ.. కేవలం తనే నిర్మాతగా చిత్రాలు రూపొందించే ఈ హీరో మంచి చిత్రాన్ని అందిస్తాడు అనే పేరుతో మాత్రమే కొత్త చిత్రం విడుదలకు అంచనాలు ఏర్పడడం విశేషంగా చెప్పుకోవాలి. మరి భేతాళుడులో ఎలాంటి వెరైటీ కథాంశంతో విజయ్ ఆంటోనీ మెప్పిస్తాడో చూడాలి.

Similar News