టాలీవుడ్ లక్కీ గర్ల్!!

Update: 2017-06-07 05:58 GMT

టాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు ఇంకా విడుదల కానేలేదు. కానీ ఆ హీరోయిన్ కి మాత్రం భీభత్సమైన డిమాండ్ ఏర్పడిపోయింది. టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ లా మారిన మేఘ ఆకాష్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. మొదట్లో కోలీవుడ్ లో గౌతమ్ మీనన్ - ధనుష్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న మేఘ ఆకాష్ పైనే ఇప్పుడందరి చూపు. ఇప్పుడు ఇక్కడ నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నితిన్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'లై' చిత్రంలో హీరోయిన్ గా సెట్ అవ్వడమే కాక... రామ్ కొత్త ప్రాజెక్ట్ లో కూడా ఛాన్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ఈ మధ్యనే ఒక చిత్రం ప్రారంభమైంది. ఆ చిత్రంలో కూడా హీరోయిన్ గా అవకాశం అందిపుచ్చుకుని అదృష్టం అంటే తనదే అనేలా చేసింది మేఘ. ఒకేసారి ఇద్దరు కుర్ర హీరోలతో జోడి కడుతున్న ఈ మేఘ ఆకాష్ కి ఇప్పుడు మరో అవకాశం తలుపుతట్టినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ నిర్మాణ సారధ్యంలో నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం చేస్తున్న కొత్త చిత్రం ఇప్పుడు పట్టాలెక్కబోతుంది. ఆ చిత్రంలో నితిన్ కి జోడిగా మేఘ ఆకాష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి ఒకేసారి ఒకే హీరోతో రెండు సినిమాల్లో నటిస్తూనే మరో యువ హీరోతో జోడి కడుతున్న ఈ భామకు అదృష్టం ఏ రేంజ్ లో ఉందొ చూశారూ.. ఇక నితిన్ కొత్త చిత్రం ఈ నెల 28 నుండి మొదలుకాబోతుంది. అయితే నితిన్ చిత్రంలో మేఘ ఆకాష్ హీరోయిన్ అనే విషయం చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

Similar News