టాలీవుడ్ టాప్ హీరోయిన కోలీవుడ్ ఎంట్రీ

Update: 2016-04-04 15:53 GMT

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో టాప్ ఎవరంటే.. టక్కుమని రకుల్ ప్రీత్ సింగ్ పేరు గుర్తు రావాల్సిందే. ప్రస్తుతం ఈ పంజాబీ పోరి చేసిన సినిమాలు చేతిలో ఆఫర్లు.. ఈ స్టేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో చిత్రంతో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. మరో మూడు వారాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సరైనోడులో కూడా కనిపించనుంది. ఇది కాక రామ్ చరణ్- సురేందర్ రెడ్డిల మూవీలో కూడా రకుల్ నే ఫిక్స్ చేయగా.. బెల్లంకొండ సురేష్-బోయపాటి కాంబినేషన్ లో కూడా ఈ భామనే తీసుకోనున్నారు. ఇప్పుడీ చిన్నది చెన్నైపై దృష్టి పెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నుంచి వచ్చిన ఆఫర్.. రుకుల్ ప్రీత్‌ని టెంప్ట్ చేసిందని తెలుస్తోంది. విశాల్ స్వయంగా నిర్మిస్తున్న ఈ మూవీని మిస్కిన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం టాక్స్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా.. మే నెల తొలివారంలో అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్సులున్నాయి. అయితే.. రకుల్ ప్రీత్‌కి కోలీవుడ్ సినిమాలు కొత్తేం కాదు. అసలు తెలుగు అరంగేట్రం కంటే ముందు రెండు తమిళ్ సినిమాలు చేసిందీ పంజాబీ పాప. తడయార తాక్క.. పూతగం అనే రెండు తమిళ సినిమాల్లో కనిపించినా హిట్ దక్కలేదు. దాదాపు నాలుగేళ్లు గడిచిపోవడంతో.. ఇప్పుడు కోలీవుడ్‌లో రకుల్ రీఎంట్రీ ఇస్తోందని చెప్పచ్చు.

Similar News