టాప్ లెస్ గా మహేష్ హీరోయిన్

Update: 2018-01-20 05:17 GMT

మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గర అయింది కృతి సనన్. పాపం ఈ బ్యూటీకి టైం కలిసి రావట్లేదు. 1 నేనొక్కడినే ప్లాప్ తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ చేస్తే అది కూడా ప్లాప్ ఫలితాన్ని రిపీట్ చేసింది. అయినా అడపాదడపా హింది సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్న కృతి తాజాగా డబ్బూ రత్తాని క్యాలెండర్ కు హాట్ స్టిల్ ఒకటి ఇచ్చింది.

డబ్బూ రత్తాని క్యాలెండర్ కు ఇండియాలో చాలానే ఫాన్స్ వున్నారు. కింగ్ ఫిషర్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందొ దీనికి అంతకు మించే ఉంది. గత 19 ఏళ్ళుగా ఈ క్యాలెండర్ ప్రింట్ చేస్తున్న డబ్బూ రత్తాని ఫోటో షూట్ కోసం బాలీవుడ్ తారలు ఎగబడతారు. అయితే ఈ సారి డబ్బూ రత్తాని చాలా స్పెషల్ గా క్యాలెండర్ డిజైన్ చేసాడు.

ఇందులో కృతి సనన్ తో పాటు.. ఐశ్వర్య రాయ్, సిద్దార్థ్ మల్హోత్రా, అలియా భట్, సన్నీ లియోన్, అలియా భట్, సోనాక్షి సిన్హా..ఇలా చాలానే వున్నారు. కృతి సనన్ స్టిల్ మాత్రం అన్నింటిలోకి స్పెషల్ గా నిలిచింది. టాప్ లెస్ గా నించుని పైన ఏ ఆచ్చాదన లేకుండా జస్ట్ ఒక టోపీ తో తన క్లీవేజ్ మాత్రం దాచేసిన కృతి ఒక్క దెబ్బతో అందరిని ఫ్లాట్ చేసేసింది.

Similar News